calender_icon.png 15 March, 2025 | 10:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా కెరీర్‌లో ఇదే తొలిసారి

15-03-2025 12:06:35 AM

హీరోయిన్స్‌కి దాదాపుగా ఎవరో ఒకరు డబ్బింగ్ చెబుతారు. ఎందుకంటే వారి వాయిస్.. పాత్ర పరంగా వారికి సూట్ అవదు. తమ పాత్రకు తామే డబ్బింగ్ చెప్పుకునే హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. ఈ క్రమంలోనే డబ్బింగ్ ఆర్టిస్ట్‌లకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. ముద్దుగుమ్మలంతా తమ వాయిస్‌తోనే డబ్బింగ్ చెప్పేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

ఇప్పటికే కొందరు స్టార్ హీరోయిన్స్ తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. తాజాగా వీరి కోవలోకి మరో హీరోయిన్ వచ్చి చేరుతోంది. ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు.. పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే. ఈ అమ్మడు తమిళంలో సూర్య సరసన ‘రెట్రో’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో పూజాహెగ్డే.. తన పాత్రకు తనే డబ్బింగ్ చెబుతోందట.

ఈ విషయా న్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. “నా కెరీర్‌లో తొలిసారి సొంతంగా డబ్బింగ్ చెప్పడం ఆనందంగా ఉంది. ఇదే పద్ధతిని ఇక ముందూ కొనసాగిస్తా. తెలుగు సహా అన్ని భాషల్లోనూ డబ్బింగ్ చెప్పేందుకు ప్రయత్నిస్తా” అంటూ పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూజా హెగ్డే ‘రెట్రో’తో పాటు ‘జన నాయగన్’, ‘కాంచన 4’ వంటి చిత్రాల్లో నటిస్తోంది.