calender_icon.png 10 January, 2025 | 11:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుల్లయ్య సొంత బ్యానర్‌లో తొలి చిత్రమిదే

09-01-2025 12:00:00 AM

‘శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం’ 1960 జనవరి 9న విడుదలైంది. ఈ పౌరాణిక చలన చిత్రానికి పీ పుల్లయ్య దర్శకత్వం వహించగా, వీ వెంకటేశ్వర్లు నిర్మించా రు. ఇది తిరుమలలో విష్ణుమూర్తి వేంకటేశ్వర అవతారం ఆధారంగా రూపొం దించబడింది. ఇందులో ఎన్టీ రామారావు, సావిత్రి, ఎస్ వరలక్ష్మి నటించగా పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం అందించారు. పీ పుల్లయ్య సొంతంగా స్థాపించిన పద్మశ్రీ పిక్చర్స్ బ్యానర్‌లో వచ్చిన తొలి చిత్రమిది.

ఈ చిత్ర విజయం ‘లవకుశ’ పునర్నిర్మాణానికి స్ఫూర్తినిచ్చింది కూడా ఈ సినిమానే కావటం విశేషం. అప్పట్లో ఈ సినిమా ప్రదర్శితమైన థియేటర్లలో వేంకటేశ్వ రుని విగ్రహాలు ఏర్పాటుచేయడం, ప్రేక్షకులు కానకలు సమ=ర్పించటంతో ఆలయ వాతావరణం నెలకొన్నదట! ఇంత గొప్పగా ప్రేక్షకాదరణ పొందిన ఈ సినిమా విశేషాలు చర్చించుకోదగ్గవే.

సప్త రుషులు యజ్ఞంలో ఆయు ష్షును త్రిమూర్తుల్లో ఎవరికి సమర్పిస్తున్నారన్న నారదుని ప్రశ్నతో సమాధానం కోసం బయలుదేరిన భృగు మహర్షికి ఎదురైన చేదు అనుభవాలేంటి? భృగు శాపానికి గురయ్యేంత పెద్ద తప్పు త్రిమూర్తులు ఏం చేశారు? భూలోకంలో బ్రహ్మకు పూజ లు జరగకపోవటానికి కారణమేంటి? శివుడిని లింగ రూపంలోనే ఎందుకు పూజిస్తారు?.. అనేది ఇందులో చూపించారు.

శ్రీమహావిష్ణువు వక్షస్థలంపై భృగు కాలితో తన్నటం.. విష్ణువుపై అలక వహించి శ్రీమహాలక్ష్మి భూలోకానికి చేరుకోవటం.. తర్వాత ఇక్కడ ఏం జరిగింది అనే అంశాలతో సినిమాను తెరకెక్కించారు. బావాజీ వృత్తాంతం, శ్రీనివాసుడి మహిమలు చూపే ఇతర కథలను కూడా ఈ చిత్రంలో అద్భుతంగా చూపించారు.