calender_icon.png 2 February, 2025 | 7:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇది కార్పొరేట్ల బడ్జెట్

02-02-2025 12:00:00 AM

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ 

హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి) : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బడా కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడే బడ్జెట్‌గా ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి  జాన్‌వెస్లీ విమర్శించారు. శనివారం ఆయన మాట్లాడు తూ.. సామాన్యులకు నేరుగా లబ్ధి చేచూర్చే  ఒక్క పథకం లేదన్నారు. వేతన జీవులను పెద్దఎత్తున  సంతృప్తిపరుస్తామని చెప్పి ముష్టివేసినట్లు ఊరట కల్పించారని ఎద్దేవా చేశారు.

దేశ ప్రజల బడ్జెట్ అని ప్రధాని మోదీ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నా రు. ప్రజా వ్యతిరేకంగా ఉన్న బడ్జెట్‌ను నిరసి స్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు  తెలిపారు. ఢిల్లీ, బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయా రాష్ట్రాలకు నిధులు కేటాయిం చారని ఆయన విమర్శించారు.