calender_icon.png 1 April, 2025 | 8:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా కెరీర్‌లో బెస్ట్ మూవీ ఇదే!

25-03-2025 12:00:00 AM

హీరో నితిన్ నుంచి వస్తున్న మరో కామెడీ ఎంటర్‌టైనర్ ‘రాబిన్‌హుడ్’. శ్రీలీల కథానాయికగా నటించిన ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. మైత్రీమూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకీ కుడుముల విలేకరులతో సమావేశమై సినిమా విశేషాలను పంచుకున్నారు. “-భీష్మ సినిమా తర్వాత చిరంజీవి కోసం ఒక స్టోరీ, స్క్రీన్ ప్లే రాశాను.

ఆ కథలో ఎక్కడో ఓ దగ్గర ఆయన్ను మెప్పించలేకపోయా. మరో కథతో వస్తానని చెప్పా. తర్వాత నితిన్‌ను కలిశా. నేను హీరోని బట్టి కథ రాస్తా. ‘రాబిన్‌హుడ్’ ఐడియా ముందే ఉంది. దీన్ని నితిన్‌తో చేయాలని ఫిక్స్ అయ్యాక ఆయనకు తగ్గట్టుగా కథను మలిచా. ఇందులో హీరో మాన్యుపులేటర్. ఫిజికల్ స్ట్రెంత్ కంటే మెంటల్ స్ట్రెంత్ స్ట్రాంగ్ అని నమ్మే పర్సన్. సినిమాలో తొలి 20 నిమిషాల తర్వాత కథ మారిపోతుం ది.

ఈ సినిమా నితిన్‌తోపాటు నా కెరీర్‌లో బెస్ట్ మూవీ అవుతుందని నమ్మకం ఉంది. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ ఎంటర్‌టైనర్ ఇది. -ఇందులో ఒక క్యామియోరోల్ ఇంటర్నేషనల్ స్టార్ చేస్తే బాగుంటుందని నిర్మాతలకు డేవిడ్ వార్నర్ పేరు సూచించా. నిర్మాత రవి చాలా సీరియస్‌గా ట్రై చేయడంతో కుదిరింది. రాజేంద్రప్రసాద్ క్యారెక్టర్ రాయడం మొదలుపెట్టినప్పట్నుంచి ఆయనే కనిపించారు. -టాలెంట్ ఉండడం వేరు.. టాలెంట్ ఉందని ఊహించుకోవడం వేరు.

ఇందులో శ్రీలీల క్యారెక్టర్ రెండో టైపు (నవ్వుతూ). కేతికశర్మ చేసిన ‘అది దా సర్ర్పైజు’ స్పెషల్ సాంగ్ కథలో భాగంగానే వస్తుంది. మా నిర్మాతలు మొదట పుష్ప సినిమాలో ఆమెతో ఒక స్పెషల్ నెంబర్ చేయాలనుకున్నప్పుడు కుదరలేదు. ఈ సినిమాలో ఆ ఛాన్స్ ఉందని ఆమెతో ఈ సాంగ్ చేయించాం. 

అవసరం ఉన్న వారికోసం నిలబడే హీరో ‘రాబిన్‌హుడ్’. మా కథకు ఈ టైటిల్ యాప్ట్. నా డైలాగ్స్‌లో త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తుందని కామెంట్స్ వినిపిస్తుండటమనేది నాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్.  -నాకు చందమామ కథలంటే చాలా ఇష్టం. ఒక ఫాంటసీ టచ్ ఉండే కథలు చేయాలనుంది. నేను చిరంజీవితో కచ్చితంగా సినిమా చేస్తా” అని చెప్పారు.