18-03-2025 12:20:12 AM
సభ నుంచి ఎంఐఎం వాకౌట్
హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): అసెంబ్లీ స మావేశాలు వాడీవేడీగా కొనసాగుతున్నాయి. సోమవారం ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘ఇది గాంధీ భవన్ కాదు... అసెంబీ’్ల అని మండిపడ్డారు.
ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన అడిగిన ప్రశ్నకు సమయం ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అక్బరుద్దీన్ నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు తెలిపారు. అధికార పక్షానికే ఎక్కువ సమయం కేటాయించడాన్ని తప్పుబట్టారు. సభను నడపడంలో రేవం త్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.