calender_icon.png 1 April, 2025 | 8:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ సారు.. సెపరేటు!

28-03-2025 01:17:16 AM

  • తన పరిధిని దాటి సెటిల్మెంట్లు

తన సామాజికవర్గానికి అనుకూలంగా పనితీరు 

విస్మయంగా నారాయణపేట పోలీసు అధికారి తీరు

నారాయణపేట, మార్చి 27 (విజయక్రాంతి): ఆయనో జిల్లా పోలీసు అధికారి. కానీ, తన స్థాయి, విధులు మరిచి తన పరిధి కాని పోలీసింగ్ చేస్తుంటారు. విధి నిర్వహణ లో తన, మన తేడా  ఉండరాదన్న విషయా న్ని ఆయన పట్టించుకోరు. అన్ని వర్గాలకు సమాన న్యాయం చేయాల్సిన బాధ్యత గల హోదాలో ఉన్న సదరు అధికారి తన సామాజిక వర్గానికి చెందిన వారికి అధిక ప్రాధా న్యత ఇస్తుంటారన్నదని బహిరంగ రహస్యం.

ఇటీవల నారాయణపేటలో తన సామాజిక వర్గానికి చెందిన  ఓ మహిళ విషయంలో వ్యవహరించిన తీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పేటకు చెంది న ఓ మహిళ స్థానికంగా ఉన్న ఓ ప్రైవే టు ఆసుపత్రిలో ప్రసవ అనంతరం గుండె సంబంధిత సమస్యతో చనిపోయింది. ఈ క్రమంలో మృతురాలి తరఫున వకాల్తా పుచ్చుకొన్న పోలీసు అధికారి.. తన పరిధి కాదని తెలిసినా అందులో తల దూర్చారు.

అర్థరాత్రి వరకు ఆ ప్రవేట్ ఆస్పత్రి వద్ద ఉండి, ఆస్పత్రి నిర్వాహకులను పోలీసు స్టేషన్ కి పిలిపించి మరి పంచాయతీ చేశారు. మహిళ ప్రాణానికి రూ.6 లక్షల ఖరీదు కట్టి ఆస్పత్రి నిర్వాహకులను భయపెట్టి ఇప్పించారు. ఆసుపత్రి యాజమా న్యంది తప్పని తేలితే మెడికోలీగల్ కేసుగా పరిగణించి బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు ఎందుకు చేయలేదని పలువురు పోలీసుల తీరుపై ప్రశ్నలు గుప్పిస్తున్నారు.

గతంలో కూడా ఈ అధికారి తన సామాజిక వర్గానికి అనుకూలంగా వ్యవహరించినట్టు సర్వత్రా విమర్శలు వచ్చినా.. తన వైఖరిలో ఎలాంటి మార్పు రాకపోవటం శోచనీయం. ఇలాంటి అధికారిపై సంబంధిత అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.