calender_icon.png 18 January, 2025 | 9:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సానియా బ్యూటీ సీక్రెట్ ఇదే

19-09-2024 12:00:00 AM

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆటకు గుడ్ బై చెప్పాక వ్యక్తిగత జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తోంది. అయితే ఆమె తరచుగా అనేక వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. అయితే ఓ వీడియోలో డార్క్ సర్కిల్స్,  చర్మం సౌందర్యం గురించి టిప్స్ అందించారు. తాను యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా తీసుకుంటున్నానని, దాంతో చర్మ సౌందర్యం బాగుటుందని చెప్పారు. 

యాంటీఆక్సిడెంట్లు మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో  పోరాడుతాయి. ఇది శరీరంలో కోల్పోయిన న్యూక్లియర్ ఎలక్ట్రాన్లను తిరిగి పొందడంలో సహాయపడుతుంది. తీవ్రమైన వ్యాధులను నివారిస్తాయి. శరీరం ఒత్తిడికి లోనైనప్పుడు, అందులో ఫ్రీ రాడికల్స్ అనే కొన్ని హానికరమైన ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అవుతాయి. ఈ క్రమంలో యాంటీఆక్సిడెంట్లు ఈ ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి కణాలను రక్షిస్తాయి. అంతేకాకుండా కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు లాంటివాటిని క్షీణించకుండా రక్షిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా క్యాన్సర్, షుగర్, గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చు. అందువల్ల యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ తినడం చాలా ముఖ్యం అంటోంది సానియా. ఈ సందర్భంగా పాలకూర, బ్రోకలి లాంటివి తినాలని చెప్పిందామె.