calender_icon.png 15 January, 2025 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రకుల్ బ్యూటీ సీక్రెట్ ఇదే

10-09-2024 02:30:00 AM

రకుల్ ప్రీత్ సింగ్ మంచి నటి మాత్రమే కాదు.. ఫిటెనెస్ ఫ్రీక్ కూడా. బాలీవుడ్‌లో ఫిట్‌నెస్ ఉన్న నటీమణుల్లో ఈ బ్యూటీ ఒకరు. తన డైట్, వర్కవుట్స్ గురించి తరచుగా మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటుంది. అందుకు సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఫిట్ గా ఉండటానికి ఈ బ్యూటీ ఎలాంటి డైట్ ఫాలో అవుతుందంటే..

ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల ఆహారం తీసుకోవాలి. ఇది ఫిట్‌గా ఉండటానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రకుల్ తన డైట్ లో పప్పు, రోటీ, వెజిటేబుల్స్ వంటి హోమ్ మేడ్ ఫుడ్స్‌ను తీసుకుంటుంది. ముఖ్యంగా ఈ బ్యూటీ వైట్ షుగర్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటుంది. ఎట్టిపరిస్థితిలో వీటిని తినదు. ఇక బుల్లెట్ ప్రూఫ్ కాఫీతో రోజును ప్రారంభిస్తుంది. ఆ తర్వాత ఆమె జిమ్‌కు వెళ్తుంది. ఈ కాఫీనే నెయ్యి కాఫీ అని కూడా అంటారు. ఇది బరువు తగ్గడానికి, ఆరోగ్యంగా ఉండటానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందట. వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ తన శరీరంలో ఉండే కొవ్వును కరిగిస్తోందీ ఈబ్యూటీ.

ఆరోగ్యంగా ఉండాలన్నా, ఉబ్బరం లేకుండా ఉండాలన్నా పెరుగన్నం తినాలని రకుల్ చెబుతోంది కర్డ్ రైస్ తిన్న తర్వాత తనకు ఉల్లాసంగా, తేలికగా అనిపిస్తోందని చెప్పింది. తన ఫ్యాన్స్ కూడా ఇవీ ట్రై చేయాలని అంటోంది.