calender_icon.png 21 December, 2024 | 7:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇదేనా ప్రజాపాలన

13-09-2024 03:50:00 AM

మాజీ మంత్రి హరీశ్ రావు 

కౌశిక్‌రెడ్డికి బీఆర్‌ఎస్ నేతల పరామర్శ 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబరు 12 (విజయక్రాంతి): ‘ మా పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి చేర్చుకొని, మాపై దాడులకు పాల్పడుతున్న పాలనను ప్రజా పాలన అని, ఇందిరమ్మ రాజ్యం అని’ ఎలా అంటారని మాజీ మంత్రి హరీశ్ రావు నిలదీశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యే గాంధీ తన అనుచరులతో దాడులకు పాల్పడటం అప్రజాస్వా మికమని ధ్వజమెత్తారు. 

కౌశిక్ రెడ్డి నివాసంపై దాడి జరిగిన విషయం తెలియగానే ఆ పార్టీ  మ్మెల్యేలు హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, వివేకానందలు కొండాపూర్‌లోని నివాసంలో ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ కాంగ్రె స్  తమది ప్రజాపాలనా అని పేర్కొనడం సిగ్గు చేటన్నారు. తమ నాయకులు, కార్యకర్తలను గృహ నిర్భందం చేసి అరెస్టు చేశారని, కానీ బందోబస్తు ఇచ్చి ఎమ్మెల్యే ఇంటిపై దాడికి పంపారన్నారు. దాడి ప్రక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందన్నారు.

దాడులను నివారించడంలో ప్రభుత్వం, పోలీసులు వైఫల్యం చెందారని అన్నారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి విషయంలో తక్షణమే స్పీకర్ స్పందించాలని కోరారు. దాడికి పాల్పడిన ఎమ్మెల్యే గాంధీ, ఆయన అనుచరులను తక్షణమే అరెస్టు చేసి, కౌశిక్‌రెడ్డికి పూర్తి భద్రత కల్పించాలని కోరారు. ఈ ఘటనలో ఏసీపీ, సీఐలను తక్షణమే సస్పెండ్ చేయాలన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో హైదరాబాద్ ప్రతిష్టను పెంచితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహారిస్తుందన్నారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు తొమ్మిది కమ్యూనల్ ఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. తొమ్మిది నెలల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్రతిష్ట పాలయ్యిందన్నారు. తమ సహనాన్ని చేతగానితనంగా భావించవద్దని, తమకు తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ముఖ్యం అని అన్నారు. రాహుల్ గాంధీకి రాజ్యాంగంపై నమ్మకం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలచే వెంటనే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ దోపిడీ, మోసాలు, ఆరు గ్యారంటీల గారడీని దేశం అంతటా వివరిస్తామన్నారు. 

భౌతిక దాడులు ఉన్మాద చర్య..

 కౌశిక్ రెడ్డిపై భౌతిక దాడులకు పాల్పడటం ఉన్మాద చర్య అని ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. సైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో  మాట్లాడారు. రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు.