calender_icon.png 24 October, 2024 | 10:00 PM

ఇది మన ప్రపంచం!.

01-06-2024 12:05:00 AM

మనం పీల్చే గాలి.. తాగే నీరు.. వాతావరణ ప్రభావాలకు అనుకూలంగా నిత్యం మారుతూ ఉంటాయి. ఇది వాతావరణం లో జరిగే నిరంతర ప్రక్రియ. అయితే వాతావరణ ప్రభావం అనేది చిన్నారుల భౌతిక స్థితిపై ప్రభావం చూపుతుంది. దీన్నే ‘ఎకో యాంగ్జుటై’ అంటారు. దీని గురించి పిల్లలకు అవగాహన కల్పించాలి. ఇది మన ప్రపంచం.. దీన్ని పచ్చగా ఉంచుకోవడం మన బాధ్యత. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో స్మార్ట్ ఫోన్‌లు, వాతావరణ కాలుష్యానికి సంబంధించిన విస్త్రృత సమాచారం ఉంది. వాటి వల్ల పర్యావరణానికి జరిగే నష్టాలు, లాభాల గురించి సమాచారం పుష్కలంగా అందుబాటులో ఉంది. పర్యావరణ కాలుష్యం.. వాటి వల్ల జరిగే ప్రమాదాల గురించి తెలుకున్నప్పుడు పెద్ద వారు మాత్రమే కాదు పిల్లలు కూడా ఆందోళన చెందుతారు. వాతావరణ మార్పులు పిల్లల్లో ఆందోళన, నిస్సహాయత, భయం, ఒత్తిడికి కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

పెద్దవాళ్లు, పిల్లలు వాతావరణంలో వస్తున్న మార్పుల గురించి ఎక్కువ ఆందోళన పడుతున్నారు. భవిష్యత్‌లో నీటి కరువు ఏర్పడుతుందనే భయం ఒకవైపు, మరోవైపు కాలుష్యం కారణంగా మొత్తం నగరాలు నీట మునిగిపోయే అవకాశం ఉంటుంద నే ఆందోళన. ఈ విధమైన ఆలోచన ధోరణి పిల్లలను మానసిక ఆందోళనకు గురి చేస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు, టీచర్లు ఎప్పటికప్పుడు  పిల్లలకు పర్యావరణం గురించి, వాతావరణంలో వచ్చే మార్పుల గురించి పిల్లలకు అవగాహన కల్పిస్తూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా ప్రకృతిలో సంభవించే మార్పులకు భయపడకుండా ఉంటారు. అప్పుడప్పు డూ పర్యా వరణవేత్తలు, కాలుష్యాన్ని తగ్గించే సంస్థల గురించి చెబుతూ ఉండాలి. కాలుష్యాన్ని తగ్గించడానికి పిల్లల చేత మొక్కలను నాటించండి. సహజంగా పిల్లలు వాతావరణం వల్ల కలిగే సమస్యలను మేం ఎదుర్కోలేమనే నిస్సహాయతలో ఉంటారు. అలాంటి భావనను వారికి దూరం చేసే ప్రయత్నం చేయాలి.