06-04-2025 12:00:00 AM
మన బుజ్జాయికి కాటుక, బొట్టు, పౌడర్ తీసుకుని అద్దం ముందు అచ్చం అమ్మలాగే కూర్చుని మరీ రెడీ అవ్వాలనుకుంటారు చిన్నారులు. పెద్దవాళ్లకు లాగే మాకోసం బుజ్జి డ్రస్సింగ్ టేబుల్ ఉండొచ్చు కదా అని కలలుకంటారు. ఇటువంటి బుజ్జాయిల కోసమే డిజైన్ చేసిందే ఈ ఫర్నిచర్. మేకప్ బల్లలేకాదు.. దుస్తుల షెల్ఫ్‌లు, బుల్లి బెడ్‌లు కూడా ఇప్పుడు మార్కెట్‌లోకి వచ్చేశాయి. ఇవన్నీ పిల్లల గదిని మరింత అందంగా, ఆకర్షణీయంగా మార్చేస్తున్నాయి. వారి బాల్యాన్ని వర్ణభరితం చేస్తున్నాయి.