ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
హైదరాబాద్, డిసెంబర్ 22 (విజ యక్రాంతి): తెలుగో డి సత్తాచాటడమం టే ఇది కాదని, సం ధ్య థియేటర్ తొక్కిసలాట వంటి ఘటనలు జరిగినప్పుడు సానుభూతి చూపించాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. తొక్కిసలాటలో మహిళ ప్రాణాలు కోల్పోయిన అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించాక.. మీరు పశ్చాత్తాపంతో మీడి యా సమావేశం ఏర్పాటు చేశారని అనుకున్నాం కానీ, అందుకు విరుద్ధంగా మాట్లాడారని విమర్శించారు. అల్లు అర్జున్ థియేటర్ నుంచి ఎలా వెళ్లారో అన్ని వీడియోలున్నా యని, అయినప్పటికీ మీడియాతో మనిషి చనిపోయిన విషయం మరుసటి రోజు తెలిసిందని అబద్ధం చెప్పారని మండిపడ్డారు. ప్రజాప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం చర్యలుంటాయని సీఎం అసెంబ్లీలో మాట్లాడారన్నారు. ఇప్పటికైనా అల్లు అర్జున్ ఆత్మవిమర్శ చేసుకొని.. ఆయన చేసిన ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.