calender_icon.png 27 November, 2024 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇలా కుదరదు..

27-11-2024 01:02:29 AM

  1. ప్రమాణం చేసి మరీ అబద్ధాలా? 
  2. తప్పుడు అఫిడవిట్ ఇస్తే కోర్టు పరిధిలోకి.. జాగ్రత్త 
  3. కాళేశ్వరం ఈఈ వేణుబాబుపై ఘోష్ కమిషన్ ఆగ్రహం
  4. సమాధానం చెప్పలేక అధికారి బిక్కచూపులు 
  5. రెండో రోజు 16 మంది ఇంజినీర్ల విచారణ
  6. నేడు కమిషన్ ముందుకు మరో 18 మంది.. 
  7. వాడివేడిగా కాళేశ్వరం కమిషన్ విచారణ

హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): ప్రమాణం చేసి మరీ అబద్ధాలు చెప్తారా? ఇలాగైతే కమిషన్‌కు తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినందుకు క్రిమినల్ కోర్టు పరిధిలోకి వస్తారు.. తర్వాత పరిణామాలు వేరేలా ఉంటాయని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసి ంది.

మంగళవారం 16 మంది ఇంజినీరింగ్ అధికారులను విచారించిన కమిష న్.. పలువురు ఇంజినీర్లపై ఆగ్రహం వ్యక్తంచేసింది. గతంలో వారు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా కమిషన్ వారిని ప్రశ్నించింది. పనులు, డిజైన్లు, నాణ్యతకు సంబంధించిన అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించింది.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన డీఈ, ఏఈఈలను జస్టిస్ పీసీ ఘోష్ విచారించారు. అఫిడవిట్ దాఖ లు చేశారంటే అందులో ఇచ్చిన అంశాలన్నింటికీ బాధ్యత వహిస్తున్నట్టు అర్థం.. కానీ, అఫిడవిట్‌లో తప్పుడు సమాచా రం ఇచ్చి అదే అంశంపై కమిషన్‌ను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారంటే కోర్టు పరిధిలోకి మీరు తప్ప కుండా వస్తారని గుర్తుంచుకోవాలని ఈఈ గంగం వేణుబాబుపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

కమిషన్‌కు అన్ని విషయాలు తెలుసని, కమిషన్ ముందు ఇలా చేస్తే కుదరదని మండిపడ్డారు. సుం దిళ్ల బ్యారేజీలోని 2ఏ బ్లాకు అంతకుముందే డిజైన్ చేయకుండా నేరుగా నిర్మాణం చేసినట్టు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు ఈఈ వేణుబాబు తెలిపారు. బ్లాకుల నిర్మాణం ఎన్నో నంబర్ బ్లాక్ నుంచి ప్రారంభమైందని.. అందులో 2ఏ బ్లాక్ ఎక్క డ నిర్మించారని కమిషన్ అడిగిన ప్రశ్నకు ఈఈ సమాధానం ఇవ్వలేక తటపటాయించారు.

తనకు గుర్తుకు రావడం లేదని తెలి పారు. ఈఈ స్థాయి అధికారికి పనులు ప్రారంభించిన తేదీ గుర్తు లేకపోయినా కనీ సం ఏ ఏడాదిలో పనులు ప్రారంభించారో కూడా తెలియకుంటే ఎలా? అని సీరియస్ అయ్యారు. అఫిడవిట్ ఇచ్చిన తర్వాత ఇప్పు డు విచారణ సమయంలో గుర్తుకురావడం లేదంటే ఎలా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఈఈ స్థాయిలో ఉండి చేసిన నిర్మా ణాన్ని ఎలా మర్చిపోతారని.. ఇదంతా మీ విధుల్లో భాగం కాదా? అని అడిగారు. అఫిడవిట్‌లో ఇచ్చిన సమాచారంతో సరిపోని విధంగా సమాధానాలు ఇచ్చినందుకు కోర్టు పరిధిలో విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమయంలో ఈఈ తీవ్రంగా ఒత్తిడికి గురై బిక్కచూపులు చూశా రు. చివరకు తాను అఫిడవిట్‌లో ఇచ్చింది తప్పు అని అంగీకరించారు. 

సీఈ నల్లా వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకే 

సీఈ నల్లా వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకే సుందిళ్ల బ్యారేజీలోని 2ఏ బ్లాకును నిర్మించినట్టు ప్రాజెక్టు రిటైర్డ్ ఈఈ బండారి ధర్మ య్య కమిషన్‌కు తెలిపారు. డిజైన్లు లేకుండా పనులు ఎలా చేపడతారని జస్టిస్ పీసీ ఘోష్ అడగ్గా.. ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. బ్లాక్ 1, బ్లాక్ 2 మధ్యలో బ్లాక్ 2 ఏ నిర్మించినట్టు వివరించారు.

పనులకు సం బంధించిన ప్లేస్మెంట్ రిజిస్టర్లు, మెజర్మెంట్ బుక్స్‌పై ఇంజినీర్ల సంతకాలు తీసుకొని, స్వాధీనం చేసుకుంది. సీడీవో సీఈ డ్రాయిం గ్స్ అప్రూవ్ చేశారని, ఆ సమయంలో తాను ప్రాజెక్టు పరిధిలో పనిచేయలేదని సీడీవో శాఖకు చెందిన ఈఈ వేణుగోపాల్ కమిషన్‌కు తెలిపారు. తాను డిపార్ట్‌మెంట్‌లో జాయిన్ అయ్యే నాటికే డ్రాయింగ్స్, డిజైన్స్ అప్రూవ్ అయినట్టు వెల్లడించారు. 

మంగళవారం డిఫ్యూటీ ఈఎన్సీలు నరహరిబాబు, చంద్రశేఖర్, ఈఈలు నూనె శ్రీధర్, విశ్వేశ్వర్‌రావు, డిఫ్యూటీ ఈఈలు సీహెచ్ సునీత, సతీశ్, ఏఈఈ హరిత తదితరులను విచారించి వారితో ప్లేస్మెంట్ రిజిస్ట ర్లు, మెజర్మెంట్ బుక్స్‌పై కమిషన్ సంతకాలు తీసుకుంది. 

నేటితో క్షేత్ర స్థాయి ఇంజినీర్ల విచారణ పూర్తి 

కాళేశ్వరం కమిషన్ విచారణ వాడివేడిగా సాగుతోంది. ఈ విడతలో 52 మంది క్షేత్ర స్థాయి ఇంజినీర్లను విచారిస్తుండగా, సోమవారం 18 మంది, మం గళవారం 16 మందిని కమిషన్ విచారించింది. బుధవారం 18 మంది ఇంజి నీర్లను కమిషన్ విచారణ చేయనుంది.

రెండు రోజుల్లో 34 మంది విచారణ పూర్తి కాగా, బుధవారం 18 మందిని విచారిస్తారు. దీంతో మూడు రోజుల్లో మొత్తం 52 మంది క్షేత్రస్థాయి ఇంజినీర్ల విచారణ పూర్తి కానుంది. ఆ తర్వాత ఐఏఎస్ అధికారుల వంతు ఉంటుందని సమాచారం.