calender_icon.png 27 September, 2024 | 6:55 PM

ఇది ఎన్‌కౌంటర్ కాదు..

26-09-2024 02:28:50 AM

బద్లాపూర్ ఘటనపై హైకోర్టు ప్రశ్నల వర్షం

ముంబై, సెప్టెంబర్ 25: మహారాష్ట్రలోని థాణే జిల్లా బద్లాపూర్‌లోని ఓ పాఠ శాలలో ఆగస్టులో ఇద్దరు చిన్నారిపై లైంగి క దాడి కేసులో నిందితుడిగా ఉన్న పాఠశాల స్వీపర్ అక్షయ్ షిండే ఎన్‌కౌంటర్‌పై ముంబై పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వాన్ని బాంబే హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది.

ఈ ఎన్‌కౌంటర్‌పై నిందితుడి తల్లి దండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం హైకోర్టు విచారించింది. సోమవారం నిందితుడుని పోలీసు కారు లో బద్లాపూర్‌కు తీసుకువచ్చే సమయం లో నిందితుడు పోలీసుల గన్ లాక్కొని కాల్పులు జరపడంతో ఆత్మరక్షణలో భాగంగా తాము ఎదురుకాల్పులు జరిపామని పోలీసులు కోర్టుకు తెలిపారు.

ఈ సందర్భంగా మహారాష్ట్ర పోలీసులు, ప్రభుత్వంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రిపోర్టులో పేర్కొన్నట్లు షిండే మూడు బుల్లెట్లు కాలిస్తే పోలీసులకు తాకిన ఒక బుల్లెట్ కాకుండా మిగితా రెండు బుల్లెట్లు ఎక్కడ? అని జస్టిస్ రేవతి మెహితే దేరే, జస్టిస్ ప్రృథ్వీరాజ్ చవాన్‌తో కూడిన బెంచ్ ప్రశ్నించింది.

పోలీసులు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని కోర్టు అభిప్రాయ పడింది. ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌లా కన్పిస్తుంది అని ఆరోపించింది. 

ఎన్నికల్లో మైలేజ్ పొందేందుకే..

దీపావళి అనంతరం మహారాష్ట్ర అసెం బ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కావాలనే షిండేను హత్యచేసి ఆ మైలేజ్‌తో గెలుపొందాలని చూస్తున్నారని నిందితుడి తరఫు న్యాయవాది అనుమానం వక్తం చేశారు. ఈ కేసుపై విచారణను కోర్టు గురువారానికి వాయిదా వేసింది. అయితే నిందితుడి ఎన్‌కౌంటర్‌ను హర్షిస్తూ ముం బయి సిటీలో భారీ హోర్డింగ్‌లు దర్శనమిస్తున్నాయి.

బద్లా పూరా (ప్రతీకారం తీరింది) అని హోర్డింగ్‌ల్లో రాసి ఉంది. ఈ క్రమంలో బద్లాపూర్ ఎన్‌కౌంటర్‌పై మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే స్పందిచారు. ‘పోలీసులు ఆత్మరక్షణ కోసమే నిందితుడిపై కాల్పులు జరిపారని.. ప్రతిపక్షాలు కావాలనే దీనిని రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు.