calender_icon.png 13 March, 2025 | 8:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇది.. కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు

13-03-2025 12:16:33 AM

బీఆర్‌ఎస్  నేతలు మల్లయ్య యాదవ్, లింగయ్య యాదవ్ 

మోతే, మార్చి 12 : ఉమ్మడి జిల్లాలో పంట పొలాలకు సాగు నీళ్లు అందటం లేదు. వదులుతున్న నీరు కూడా సాఫీగా  భూములకు చేరడం లేదు.కాలువలు చివరి భూములకు దిక్కే లేకుండా పోయింది. రైతులకు అండగా  ఉండాల్సిన ప్రభుత్వం హెలికాప్టర్లలో తిరుగుతూ విలాసంగా గడుపుతున్నారని పదేండ్లల్లో లేని కరువు ఇప్పుడు ఎలా వచ్చిందని బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగులలింగయ్యయాదవ్, కోదాడమాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.

సూర్యాపేట జిల్లా మోతె మండల పరిధిలోని రాఘవపురం గ్రామం లో ఎండిన పొలాలను బుధవారం పరిశీ లించారు. మండలపార్టీ అధ్యక్షుడు శీలం సైదులు, జిల్లా నాయకులు ఏలూరి వెంకటే శ్వరరావు, యుగేందర్ రెడ్డి,యూత్ నాయ కులు పాషా, మాజీ సర్పంచులు, ఎంపిటిసి లు నాయకులు తదితరులు పాల్గొన్నారు.