calender_icon.png 15 January, 2025 | 6:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇదేం చిన్న సమస్య కాదు!

12-09-2024 12:00:00 AM

నెయిల్ పాలిష్‌ను ఇష్టపడని అమ్మాయిలు ఉంటారా చెప్పండి? మార్కెట్‌లో ఎన్ని రంగులు ఉన్నాయో.. అవన్నీ పది వేళ్లకు కనిపించాల్సిందే! ట్రెండ్‌లో వస్తున్న మార్పులను యువత తు.చ తప్పకుండా పాటిస్తున్నారు. ధర ఎంత? దాంట్లో ఏ కెమికల్స్ వాడుతున్నారు? వాటి వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని జరుగుతుంది? అనేవి ఏవి పట్టించుకోకుండా జస్ట్ ట్రెండ్ ఫాలో అవుతున్నారు అంతే. నెయిల్ పాలిష్‌లో వాడే కొన్ని రకాల రసాయనాల వల్ల అలెర్జీ, క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. గోర్లకు వేసే జెల్ మెనిక్యూర్ కోసం వినియోగించే అల్ట్రావయలెట్ డ్రయర్ల వల్ల క్యాన్సర్ ముప్పు ఉందని ఒక అధ్యయనంలో వెల్లడైంది.

తాజాగా నెయిల్ పాలిష్‌ను ఎంతో ఇష్టపడే  సోఫియా అనే అమ్మాయి.. తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో వదిలింది. నెయిల్ పాలిష్ వల్ల కలిగే ప్రమాదాన్ని, దాని తయారీకి ఉపయోగించే రసాయనాలను గురించి తెలుసుకొని.. వాటి వల్ల జరిగే అనార్థలను ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ను 2.9 మిలియన్లకు పైగా ఫాలో అవుతున్నారు. ఆమె రోజువారీ దినచర్యలో ఉపయోగించే వస్తువులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటు జీవనశైలిలో వస్తున్న మార్పులను గురించి చెబుతున్నది. ఒక వీడియోలో.. “నేను నెయిల్ పాలిష్ అప్లు చేసి సంవత్సరాలైంది” అని పేర్కొంది. దాంట్లో ఉపయోగించే పదార్థాల గురించి తెలుసుకున్న తర్వాత ఉపయోగించడం మానేశానంది. ఆ వీడియోను దాదాపు 3.4 మిలియన్లకు పైగా వీక్షించారు. 

ఆ వీడియో వైరలైంది..

“నేను నెయిల్ పాలిష్, జెల్ పాలిష్, ఫేక్ నెయిల్స్, నెయిల్ ప్రొడెక్ట్స్ పదార్థాల ఎలా తయారు చేస్తారో తెలుసుకోవడానికి కొన్ని సంవత్సరాల సమయం పట్టింది. వాటి గురించి తెలుసుకున్న తరువాత చాలా ఆశ్చర్యపోయాను” అంటున్నారు సోఫియా. నెయిల్ పాలిష్ తయారీలో ఏమి ఉపయోగిస్తారు?  వాటి ప్రభావం ఎలా ఉంటుంది? అనేది వీడియోలో పూర్తిగా వివరించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సోఫియా వీడియో సంచలనంగా మారింది. కింది లింక్ ద్వారా వీడియోను చూడొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ లింక్: sophiaesperanza.  

డెర్మాలజిస్టులు ఏం చెప్తున్నారంటే? 

1. సూరత్‌కు చెందిన డెర్మాటాలజిస్టు డాక్టర్ నిష్టా పటేల్ చెప్పిన మాటలు.. నెయిల్ పాలిష్‌లో అనేక విష రసాయనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎరుపు రంగు నెయిల్ పాలిష్‌లో వాడే ‘టొలుయెన్’ అనే రసాయనం తలనొప్పి, మైకాన్ని కలిగిస్తుంది. దీంట్లో హానికరమైన ఫార్మాల్డిహైడ్ ఉంటుంది. ఇది క్యాన్సర్ కారకంగా పనిచేస్తుంది.    

2. న్యూ ఢిల్లీకి చెందిన చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ దీపాలి భరద్వాజ్ మాట్లాడుతూ.. ‘మెరిసే లే దా మెటాలిక్ పాలిష్’ హానికరమైన రసాయనాలను కలిగి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుం ది. పరిశుభ్రత సరిగ్గా లేనివారు ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్నా వారు నెయిల్ పాలిష్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని డాక్టర్ భరద్వాజ్ సూచించారు. 

3. న్యూ ఢిల్లీలోని మణిపాల్ హాస్పిటల్ ద్వారక లో డెర్మటాలజీ కన్సల్టెంట్ అయిన డాక్టర్ గుంజ న్ వర్మ మాట్లాడుతూ.. మీ చర్మ అవసరాలకు అనుగుణంగా నెయిల్ పాలిష్‌ని ఎంచుకోవచ్చు. నెయిల్ పాలిష్‌ని కొనుగోలు చేస్తున్నప్పుడు కఠినమైన రసాయనాలు లేని దాన్ని ఎంచుకోవాలి. అలాగే దానిపై ఉండే లెబుల్‌ను ఓ సారి పూర్తిగా చదివిన తర్వాత తీసుకోవడం ఉత్తమం అన్నారు.

రసాయనాలు, వాటి ప్రభావం!

టోల్యున్: టోల్యున్ అనే రసాయనాన్ని నెయిల్ పాలిష్‌ను సున్నితంగా, మృదువుగా ఉండడం కోసం కలుపుతారు. టోల్యున్ వల్ల తలనొప్పి, మూర్ఛ, నరాలు దెబ్బతినడం వంటివి జరుగుతాయి. 

ఫార్మాల్డిహైడ్: నెయిల్ పాలిష్ గాలికి గట్టిపడే ఏజెంట్‌గా పని చేస్తుంది. ఇది క్యాన్సర్ కారక లక్షణాలను కలిగి ఉంటుంది. తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్యలను ప్రేరేపిస్తుంది. 

కర్పూరం: కర్పూరాన్ని దీర్ఘకాలం పీల్చడం వల్ల వికారం, మూర్ఛ సమస్యలు వస్తాయి. 

జిలీన్: ఈ ద్రావకం వల్ల పదేపదే మైకం, మూర్ఛ వస్తుంది. అలాగే కంటి చర్మంపై చికాకును కలిగిస్తుంది.