calender_icon.png 19 January, 2025 | 5:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇదే నా మహల్

25-07-2024 01:34:05 AM

వైరల్‌గా జొమాటో బాయ్ రూమ్ టూర్

ముంబై, జూలై 24: ముంబై మురికివాడల్లో పరిస్థితులు ఎలా ఉంటా యో, అక్కడ జీవితం ఎంత దుర్భరమో ఇప్పటికే చాలా మందికి తెలు సు. తాజాగా ముంబై మురికివాడల జీవితానికి సంబంధించి ఓ జొమాటో డెలివరీ బాయ్ చేసిన రూమ్ టూర్ వీడియో నెట్టింటిని షేక్ చేస్తోంది. ఈ రూమ్‌కు నెలకు రూ. 500 అద్దె అని, తాను మరొకరితో కలిసి ఈ రూమ్ ను షేర్ చేసుకుంటున్నట్లు ఆ డెలివరీ బాయ్ పేర్కొన్నాడు. ఈ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది. దాదాపు 4.5 మిలి యన్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. 

ఈశాన్యం నుంచి వలస వచ్చి.. 

బార్గోయరీ అనే వ్యక్తి ఈశాన్య రాష్ట్రాల నుంచి వలసవచ్చి ముంబై లో జొమాటో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. అతడు తను నివాసం ఉంటున్న రూంకు సంబంధించిన వీడియోను పంచుకోగా.. అది విపరీతంగా వైరల్ అయింది. ఇది చూసిన ఓ నెటిజన్ బార్గోయరీకి మూడు నెలల అద్దెను పంపించాడు. ముంబై లో ఓ పక్క కొంత మంది విలాసవంతమైన జీవితం గడుపుతుంటే.. మరి కొంత మంది మాత్రం ఇలా ఇరుకుగదుల్లో జీవనం సాగిస్తున్నారని ఇది చాలా బాధాకరం అంటూ అంతా కామెంట్ చేస్తున్నారు.