దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం ‘పరదా’. శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువతో కలిసి విజ య్ డొంకడ ఆనంద మీడియా బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత తది తరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బుధవారం ఈ సినిమా టీజర్‌ను హీరో దుల్కర్ సల్మాన్ ఆన్‌లైన్‌లో లాంచ్ చేశారు.
టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అనుపమ మాట్లాడుతూ.. ‘టీజర్ ప్లే చేసినప్పుడు నా పదేళ్ల జర్నీ కనిపించింది. చాలా ఎమోషనల్ అయ్యాను. ఈరోజు ఆనందంతోపాటు ఒక బాధ్యత కనిపిస్తోంది. నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతుంది. ఈ ఇన్నేళ్లలో నా మోస్ట్ ఫేవరేట్ ఫిలిం పరదా, మోస్ట్ ఫేవరేట్ క్యారెక్టర్ సుబ్బు’ అని తెలిపింది. హీరోయిన్ దర్శన మాట్లాడుతూ.. ‘ఇలాంటి సినిమా చేయడం చాలా కష్టం.
ప్రవీణ్ చాలా టఫ్ ఛాలెంజ్ తీసుకున్నాడు’ అన్నది. డైరెక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ.. “ఐడియాలు చాలా ఉంటాయి.. ఒక నిర్మాత డబ్బులు పెడితేనే ఇలాంటి సినిమాలొ స్తాయి’ అన్నారు. ప్రొడ్యూసర్ విజయ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాతో కంటెంట్ మాట్లాడుతుంది’ అన్నారు. మరో నిర్మాత శ్రీధర్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా తీయడం మాకు బాహుబలి లాంటి పెద్ద ప్రయత్నం. టీమ్ అందరూ తమ సినిమా అనుకొని పని చేశారు” అని పేర్కొన్నారు.