calender_icon.png 17 November, 2024 | 3:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇదే నా ఆరోగ్య రహస్యం

08-11-2024 12:00:00 AM

‘లావుగా ఉన్నందుకు ఎన్నోసార్లు అవమానాలను ఎదుర్కొన్నా.. అది నన్ను మానసికంగా కుంగదీసేదని’ అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు విద్యాబాలన్. ఇన్నాళ్లు తన డైట్ విషయంలో మౌనం వహించిన విద్యాబాలన్ ఇప్పు డు అసలు సీక్రెట్‌ను బయటపెట్టేసింది. ఏడాదిలో ఎలాంటి వ్యాయా మం చేయకుండానే బరువు తగ్గి అందరి దృష్టిని ఆకర్షించింది. 45 ఏళ్ల వయసులో తాను ఎలా బరువు తగ్గిందో రివీల్ చేసింది. 

ఒక విలేకరుల సమావేశంలో నన్ను అవహేళన చేశారు.. ‘మీరు మహిళా సెంట్రిక్ సినిమాలు చేస్తూనే ఉంటారా లేదా కొంచెం బరువు తగ్గుతారా’ అని అన్నారు. దానికి నాకు చాలా బాధగా అనిపించింది. నా లుక్‌ని నిర్మాత, దర్శకుడు, ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఇష్టపడతారు. నేను ఎప్పుడూ లావుగా ఉండాలని కోరుకోలేదు. ప్రస్తుత కాలంలో లావు అనే పదా న్ని అవహేళనగా చూస్తున్నారు. అలా చూడకూడదు. ఎందుకంటే ప్రపంచంలో సన్నగా ఉండేవా రిలాగే లావుగా ఉన్నవారు కూడా ఉంటారు.

అధిక బరువు తగ్గేందుకు అనేక రకాల డైట్‌లు తీసుకున్నా.. గంటల తరబడి వ్యాయామం చేసినప్పటికీ కూడా బరువు పెరుగుతూనే ఉన్న.. నేను ఏమీ తినకపోయినా, నా బరువు పెరుగుతోంది. అది నాకు అర్థంకాక చెన్నైలో ఒక న్యూట్రిషియన్‌ను దగ్గర చూపించా. మీ శరీరంలో కొవ్వు లేదు, ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ లేని డైట్‌ని తీసుకోవాలని సూచించారు.

అలా డైట్ కొనసాగిస్తూ వచ్చా.. క్రమంగా బరువు తగ్గడం కనిపించింది. నా శరీరానికి పడని ఆహారాన్ని దూరం పెట్టా. దాంతో బరువు అదుపులోకి వచ్చింది. నేను శాఖాహారిని. నాకు పాలకూర, సీసా పొట్లకాయ పడవు. మనకు ఏది మంచిదో మనకే అర్థం అవుతుంది.  

వర్కవుట్స్ చేయడం మానేశా. గంటల కొద్ది వ్యాయామం చేయను. ఒకప్పుడూ అధిక బరువు కారణంగా లావుగా ఉన్నానని అందరూ అనడంతో మానసికంగా చాలా బాధపడ్డ. అలానీ ఏడాది పొడవునా వర్కవుట్ చేయను. మొదటిసారి ఈ ఏడాది నుంచే వర్కవుట్స్ చేయడం మానేశా. మన శరీరాలు మానసికంగా మనం ఏం చేస్తున్నామో వ్యక్తీకరిస్తాయి. అందుకే చాలామంది వివిధ కారణాలు వల్ల బరువు పెరుగుతా రు.

నేను జిమ్‌లో బాగా వర్కవుల్ చేస్తానని అంటారు. అలా అసలు చేయొద్దని చెబుతా. ప్రస్తుతం నా బరువును అదుపులో ఉంచుకున్నాను. గతంలో కన్నా ఆరోగ్యంగా ఉన్నా. నా దృష్టిలో లావు, పొట్టి, రంగును బట్టి కాదు కానీ వ్యక్తిత్వాన్ని చూసి గౌరవించడం ప్రధానం.