అర్జున్ సర్జా, జెడి చక్రవర్తి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఇద్దరు’. ఎస్‌ఎస్ సమీర్ దర్శకత్వంలో మహ్మద్ ఫర్హీన్ ఫాతిమ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. డీఎస్ రెడ్డి సమర్పణలో ఎఫ్‌ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కింది. ఈ నెల 18న ఇద్దరు చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకు సంబంధించి తాజాగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో హీరోయిన్ సోని చరిష్ట మాట్లాడుతూ.. “అర్జున్, చక్రవర్తి సినిమాలో నాకు చాలా సపోర్ట్ చేశారు” అని చెప్పారు. దర్శకుడు సమీర్ మాట్లాడుతూ.. “సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి లొకేషన్స్‌లో హై క్వాలిటీతో చేశాం. కళాతపస్వి కె.విశ్వనాథ్‌కి ఇది చివరి సినిమా. ఆయన ఇష్టంగా చేసిన సినిమా ఇది. అంతేకాకుండా ఒక పాటలో కె.విశ్వనాథ్ స్టెప్స్ కూడా వేశారు” అని తెలిపారు.