ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
- తొలి రౌండ్‌లో సునాయాస విజయాలు అల్కరాజ్, సిన్నర్, గాఫ్ ముందంజ
- సిట్సిపాస్, ఒస్తాపెంకాకు షాక్
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ రెండో రోజు ఎలాంటి సంచలనాలు నమోదు కాలేదు. ప్రపంచ నంబర్‌వన్ జానిక్ సిన్నర్‌తో పాటు 25వ టైటిల్‌పై కన్నేసిన జొకోవిచ్, అల్కరాజ్ విజయాలు అందుకోగా.. మహిళల విభాగంలో స్వియాటెక్, గాఫ్ తమ జోరును ప్రదర్శిస్తూ ముందంజ వేశారు. టాప్ టెన్‌లో ఉన్న సిట్సిపాస్, ఒస్తాపెంకా తొలి రౌండ్‌కే పరిమితమయ్యారు.
మెల్‌బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెర్బియా వీరు డు నొవాక్ జొకోవిచ్ శుభారంభం చేశాడు. 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేసిన జొకోవిచ్ సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో 4 6 6 6 అన్‌సీడెడ్ భారత సంతతి నిశేష్ బసవరెడ్డిపై విజయం సాధించాడు. ఎప్పటిలానే తనకు అలవాటైన రీతిలో తొలి సెట్ ను ఓడిన జొకోవిచ్ ఆ తర్వాత ప్రత్యర్థి బలా న్ని మొత్తం లాగేసుకుంటూ మూడు వరుస సెట్లలో గెలుపొంది మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు.
మూడు గంటల పాటు సాగిన పోరులో జొకోవిచ్ 23 ఏస్‌లతో పాటు 52 విన్నర్లు సంధించగా.. నిశేష్ 4 ఏస్‌లు, 32 విన్నర్లకే పరిమితమయ్యాడు. ఇక 8 డబుల్ ఫాల్ట్స్‌తో నిశేష్ మూల్యం చెల్లించుకున్నాడు.
ఇక ప్రపంచ నంబర్ వన్ జానిక్ సిన్నర్ కూ డా ముందంజ వేశాడు. ఢిపెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన సిన్నర్ 7 (7/2), 7 (7/5), 6 చిలియాకు చెందిన నికోలస్ జారీని ఓడించాడు. ప్రపంచ మూడో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ 6 7 6 అలెగ్జాండర్ షెవంకో (కజకిస్థాన్)పై వరుస సెట్లలో గెలుపొందా డు. పదో సీడ్ దిమిత్రోవ్ గాయంతో వైదొలగడంతో పస్సారోకు వాకోవర్ లభించింది. 11వ సీడ్ సిట్సిపాస్‌కు అమెరికా అన్‌సీడెడ్ ఆటగాడు అలెక్స్ మిచెల్‌సన్ షాక్ ఇచ్చాడు.
గాఫ్ రయ్ రయ్..
మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ మూడో ర్యాంకర్ కోకో గాఫ్ రెండో రౌండ్‌లో అడుగుపెట్టింది. తొలి రౌండ్‌లో గాఫ్ 6 6 తన దేశానికే చెందిన మాజీ ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత సోఫియా కెనిన్‌ను చిత్తు చేసింది. గంటా 20 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో గాఫ్ 12 ఏస్‌లు, 28 విన్నర్లు కొట్టింది. మరోవైపు కెనిన్ మాత్రం 3 ఏస్‌లు, 14 విన్నర్లకే పరిమితమైంది. ఇక రెండో ర్యాంకర్ స్వియా టెక్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండానే ముందంజ వేసింది.
స్వియాటెక్ (పోలండ్) 6 6 చెక్ రిపబ్లిక్‌కు చెందిన సైనికోవాపై విజయం సాధించింది. రెండో రౌండ్‌లో స్వియాటెక్ స్రమ్కోకాను ఎదుర్కోనుంది. ఏడో సీడ్ జెస్సికా పెగులా 6 6 ఆస్ట్రేలియాకు చెందిన మాయా జాయింట్‌ను ఓడించింది. 16వ సీడ్ ఒస్తాపెంకోకు అన్‌సీడెడ్ బెన్‌కిక్ ఊహించని షాక్ ఇచ్చింది. మిగిలిన మ్యాచ్‌ల్లో నవోమి ఒసాకా 6 3 6 గార్సియాపై గెలుపొందగా.. పటపోవా, ఆండ్రీవా, కొలిన్స్, స్వితోలినా రెండో రౌండ్‌కు చేరుకున్నారు.