calender_icon.png 8 January, 2025 | 11:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లలతో బంధం ఇలా..

12-12-2024 12:00:00 AM

ఈరోజుల్లో పేరెంటింగ్ అనేది కష్టంగా మారుతోంది. పిల్లలకు  చిన్పప్పట్నించే కుటుంబసభ్యులతో ప్రేమగా, బాధ్యతగా ఉండటం నేర్పాలి. పిల్లలు ఉదయం లేవగానే తల్లిదండ్రుల దగ్గరకే వస్తారు. అప్పుడు ఓ వెచ్చని కౌగిలింతతో వారికి గుడ్ మార్నింగ్ చెప్పాలి. పసివాళ్లు అయిన పెద్దవాళ్లు అయినా బిడ్డలే కదా.. అందుకే ఉదయానే కౌగిలించుకోవడం వల్ల వారిలో ఆత్మస్థైర్యం పెరిగిపోతుంది. దీంతో పిల్లల భయాన్ని పోగొట్టి మీరున్నారనే ధైర్యాన్ని ఇస్తుంది.

అలాగే పిల్లలతో వారానికి  ఓసారైనా ఏదైనా ఆట ఆడడం అలవాటు చేసుకోండి. ఏ గేమ్ అయినా కలిసి ఆడడం వల్ల మీ మధ్య బంధం పెరుగుతుంది. ఇంటి పని చేస్తున్నప్పుడు వారిని కూడా భాగస్వామ్యం చేసుకోండి. మొక్కలకు నీళ్లుపోయడం, ఇల్లు సర్దడం ఇలాంటి పనులు చెప్పవచ్చు.  ఇదివారిలో స్ఫూర్తిని పెంచుతుంది. కలిసి తినేందుకు ప్రయత్నించండి. పంచుకుని తినడం వల్ల కూడా ప్రేమ, కేరింగ్ పెరుగుతుంది. అలాగే వారి మనసులోని మాటలు వినాలి. అప్పుడే మరింత దగ్గరవుతారు.