calender_icon.png 27 September, 2024 | 4:45 AM

చపాతీలను ఇలా కాలుస్తున్నారా!

24-09-2024 12:00:00 AM

చపాతీలు, రొట్టెలు లేదంటే.. ఇతర ఆహార పదార్థాలు ఏవైనా నేరుగా మంటపై అధిక ఉష్ణోగ్రతల వద్ద కాల్చడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఓ అధ్యయనం తేల్చింది. అధిక ఉష్ణోగ్రతపై వండటం వల్ల క్యాన్సర్‌కు కారణమయ్యే అకిలామైడ్, హెటెరోసైక్లిక్ అమైన్‌లు, పాలీ సైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్‌లు కూడా ఉత్పత్తి అవుతాయని వైద్యులు చెబుతున్నారు. 

* రొట్టెలు, పుల్కా వంటివి చాలామంది ఎక్కువ మంటపై కాలుస్తుంటారు. కానీ అలా కాలుస్తున్నప్పుడు నల్లగా మాడిపోకుండా చూడాలని నిపుణులు చెబుతున్నారు. మంటను తగ్గించి.. రొట్టెలను తరచూ తిప్పడం వల్ల అవి ఎక్కువ కాలకుండా, మాడకుండా ఉంటాయి. ఒకవేళ మాడితే తినేముందు నల్లగా మారిన ప్రాంతాలను తొలగించాలి. 

* నేరుగా మంటపై కాల్చిన రొట్టెలు నచ్చితే.. వాటిని వీలైనంత తక్కువ తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇందుకు బదులుగా సమతుల్యమైన ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోవాలని చెబుతున్నారు. 

* చపాతీలను నేరుగా మంటపై కాల్చకుండా పెనంపై వేయాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పెనం ఉష్ణోగ్రతను గ్రహించి.. తక్కువ వేడిపై రొట్టేలను కాల్చేలా సాయం చేస్తుంది. ఫలితంగా పీఏహెచ్‌లు, అక్రిలమైడ్ ఉత్పత్తిని నిరోధిస్తుందని చెప్పారు. 

* చపాతీలు ఎక్కువగా తీసుకునేవారు వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయాలను డైట్‌లో చేర్చుకోవాల ని చెబుతున్నారు. ఇవి ఫ్రీ రాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి క్యాన్సర్ రాకుండా సహాయ పడుతుందని నిపుణులు చెబుతున్నారు.