28-01-2025 01:23:25 AM
* టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా భారత పేసర్
* మహిళల వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా స్మృతి
దుబాయ్: ఐసీసీ విడుదల చేసిన ఉత్తమ క్రికెటర్ల అవార్డుల జాబితాలో భారత ఆటగాళ్లు దుమ్మురేపారు. 2024 ఏడాదికి గానూ ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఎంపికవ్వగా.. మహిళల వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఓ పెనర్ స్మృతి మంధాన నిలిచింది.
పురుషుల వన్డే క్రికెట ర్ ఆఫ్ ది ఇయర్‌గా అఫ్గానిస్థాన్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్‌జయ్ ఎంపికయ్యాడు. ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా భారత పేసర్ అర్ష్‌దీప్ నిలిచాడు. ఐసీసీ టీ20 జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికవ్వగా.. బుమ్రా, అర్ష్‌దీప్, పాండ్యా జట్టులో చోటు దక్కించుకున్నారు.
ఇక టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో భారత్ నుంచి బుమ్రా, జడేజా, జైస్వాల్ ఎంపికయ్యారు. మహిళల విభాగంలో మంధాన వన్డే ఉత్తమ క్రికెటర్‌గా నిలవడంతో పాటు దీప్తి శర్మతో కలిసి ఐసీసీ మహిళల వన్డే జట్టుకు కూడా ఎంపికైంది.
బూమ్ బూమ్ బుమ్రా..
గతేడాది బుమ్రా అన్ని ఫార్మాట్లలోనూ సూపర్ ఫామ్ కనబరిచాడు. ముఖ్యంగా టెస్టుల్లో నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న బుమ్రా అత్యధిక రేటింగ్‌తో సుప్రీమ్ బౌలర్‌గా నిలిచాడు. 2024లో 13 టెస్టులు ఆడిన బుమ్రా 71 వికెట్లు పడగొట్టాడు. ఇక 2024లో 13 ఇన్నింగ్స్‌లు కలిపి 747 పరుగులు సాధించిన మంధాన టాప్ స్కోరర్‌గా నిలిచింది.