calender_icon.png 29 October, 2024 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనసుల్లో నిలిచిపోయే కథ ఇది

28-10-2024 12:00:00 AM

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న పీరియాడిక్ థ్రిల్లర్ ‘క’. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీరామ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని చింతా గోపాలకృష్ణరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా దీపావళి సందర్భంగా ఈ నెల 31న తెలుగులో థియేటర్ల ద్వారా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కథానాయికా ద్వయం చిత్ర విశేషాలను పంచుకుంది. ఆ విశేషాలు వారి మాటల్లోనే... 

ఇలా మనమూ ఉండాలనిపిస్తుంది

నయన్ సారిక 

* “నేను ‘ఆయ్’ సినిమాలో నటిస్తున్న టైమ్‌లోనే ‘క’లో సత్యభామ క్యారెక్టర్ కోసం తీసుకున్నారు. ‘ఆయ్’లో ట్రెడిషనల్‌గా, ‘గం గం గణేశా’లో మోడరన్‌గా కనిపిస్తా. ‘ఆయ్’లోని పల్లవి పాత్రకు భిన్నమైన రోల్ చేయాలకున్నా. అనుకున్నట్లుగానే ఈ పాత్ర దక్కింది. ఇందులో పూర్తిగా ట్రెడిషనల్‌గా కనిపిస్తా. ఈ మూవీ కథ విన్నప్పుడు క్లుమైక్స్ మనసులో గుర్తుండిపోయింది. ప్రేక్షకులూ ఇదే అనుభూతికి లోనవుతారు. ఏ ఒక్కరికో పరిమితం కాని కథ ఇది. సినిమా చివరలో ఇలా మనమూ ఉండొచ్చు కదా అన్న భావన ప్రేక్షకులకు వస్తుంది. 

* ఈ సినిమాలో నా సత్యభామ క్యారెక్టర్ లుక్ కోసం సావిత్రి గారి లుక్‌ను రిఫరెన్స్‌గా తీసుకున్నారు. అందుకే హీరో నేను సావిత్రిలా ఉన్నానని డైలాగ్ చెబుతాడు. సావిత్రి గారిలా నేను గ్లిజరిన్ లేకుండా కన్నీళ్ల సీన్ చేయగలను. ఆమె మహానటి చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యా. 

* ఇందులో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నాం. హీరో ఎవరికి పెయిర్ అనేది మూవీలోనే చూడాలి. నేను తన్వీ కలిసి చేసిన సీన్స్ తక్కువే. అతి తక్కువ టైమ్‌లో మేమంతా మంచి ఫ్రెండ్స్ అయ్యాం. 

* కిరణ్ అబ్బవరంతో కలిసి పనిచేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాలోని యాక్షన్స్ సీక్వెన్స్ రిస్క్ అయినా ఆయనే స్వతహాగా చేశారు. సినిమా కోసం ఎంతో డెడికేషన్‌తో ఉండటాన్ని కిరణ్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. 

* ఇక నా రాబోయే సినిమాల గురించి చెప్పాలంటే.. ప్రస్తుతం కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ డిస్కర్షన్స్ జరుగుతున్నాయి. త్వరలో వాటి వివరాలు వెల్లడిస్తా.

సీక్వెల్ గురించి తర్వాత చెప్తాం 

తన్వీ రామ్

* నేను తెలుగులో నాని హీరోగా నటించిన ‘అంటే సుందరానికీ’లో నటించా. ఆ సినిమా కథలో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించా. హీరోయిన్‌గానే కనిపించాలని అనుకోవడం లేదు. నా క్యారెక్టర్ కథలో ఎంత కీలకంగా ఉందనేది చూసుకుంటా. 

* ‘క’లో రాధ క్యారెక్టర్ చేశా. రాధ ఒక స్కూల్ టీచర్. అభినయ వాసుదేవ్, సత్యభామ ఒక టైమ్ ఫ్రేమ్‌లో కనిపిస్తే, నేను మరో పీరియడ్‌లో కనిపిస్తా. నా పాత్రకు వారి పాత్రలకు మధ్య కనెక్షన్ ఏంటో స్క్రీన్ మీదే చూడాలి. సత్యభామతో నాకు సీన్స్ ఉండవు. నా క్యారెక్టర్ ఎక్కువ నైట్ షూట్స్ చేశారు. సహజంగా నేను ఎర్లీగా నిద్రపోతుంటా. నైట్ షూట్ కాబట్టి మెలకువతో ఉండాల్సి వచ్చింది.

ఇది ఛాలెంజింగ్‌గా అనిపించింది. నేను సరదాగా నవ్వుతూ ఉంటాను. రాధ క్యారెక్టర్ కొన్నిసార్లు ఏడవాల్సి ఉంటుంది. ఆ లాంగ్ సీక్వెన్స్ సీన్స్ అనేకసార్లు, వివిధ యాంగిల్స్‌లో షూట్ చేశారు. అప్పుడు మళ్లీ మళ్లీ అదే ఎమోషన్‌తో ఏడవాల్సివచ్చింది. ఇలా నా పర్సనల్ లైఫ్ క్యారెక్టర్‌కు భిన్నంగా సెట్‌లో ఉండటం వ్యక్తిగతంగా నాపై ప్రభావం చూపించింది. అయితే నటిగా నేను ఇవన్నీ వృత్తిలో భాగమేనని తీసుకోవాల్సిందే.  

* సినిమాలోని కృష్ణగిరి గ్రామం కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. ప్రతి క్యారెక్టర్‌లో ట్విస్ట్‌లు, టర్న్స్ ఉంటాయి. క్లుమైక్స్ మరో స్థా యి లో ఉంటుంది. మా అందరినీ కథకు బాగా కనెక్ట్ చేసింది పతాక సన్నివేశాలే. సినిమా సమ్మరీ అంతా ‘క’ టైటి ల్‌లోనే ఉంది. కథలోని ఎన్నో ఎమోషన్స్ మా క్యారెక్టర్ ద్వారా రిఫ్లెక్ట్ అవుతాయి. 

* ‘క’ సినిమాలో సెకండ్ పార్ట్‌కు లీడ్ ఉంటుంది. కానీ సీక్వెల్ గురించి తర్వాత చెబుతాం. 

* నేను ఈ సినిమా కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు కిరణ్ వేరే ప్లేస్‌కు వెళ్తున్నారు. నేను వస్తున్నానని తెలిసి కలిసి మాట్లాడారు. కో ఆర్టిస్టులను కిరణ్ బాగా గౌరవిస్తారు. ఆయన సినిమా కోసం చూపించిన డెడికేషన్ అద్భుతమనే చెప్పాలి.  

* ప్రస్తుతం తమిళం, మలయాళంలో మల్టీపుల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నా. ‘క’ రిలీజ్ తర్వాత తెలుగులోనూ మంచి ఆఫర్స్ వస్తాయని ఆశిస్తున్నా.