22-04-2025 01:30:15 AM
పెట్టుబడులతో రండి.. హైదరాబాదే మీ గమ్యస్థానం!
హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): ‘పెట్టుబడులు పెట్టేందుకు హైదరా బాద్‌లో అనుకూల పరిస్థితులు ఉన్నాయి. నగరంలో పరిశ్రమలు నెలకొల్పండి. కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టండి. తయారు చేసిన మీ ఉత్పత్తులను అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేయండి. గ్లోబల్ మార్కెట్ సృష్టించి ఎదగండి. హైదరాబాద్‌ను మీ గమ్యస్థానం చేసుకోండి’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
జపాన్ పర్యాటనలో భాగంగా సోమవారం ఉద యం ఆయన ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ఒసాకా ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియ న్‌ను ప్రారంభించారు. ఇండియా నుంచి ఒసాకా ఎక్స్‌పోలో పెవిలియన్ ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ కావడం విశే షం. పెవిలియన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు జపాన్ ప్రతినిధులతో కలిసి సందర్శించారు.
ఈ ఎక్స్‌పో పదేళ్లకోసారి జరుగుతుంది. పెవిలియన్‌లో తెలంగాణ రైజింగ్ బృందం రాష్ట్ర సంస్కృతి, కళలు, పర్యాటక సంపద, సాంకేతిక పురోగతి, పర్యాటక రంగాలకు సంబం ధించిన అం శాలను ప్రదర్శనకు ఉంచింది. తద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నది. దీనిలో భాగంగా అక్కడి ఎన్‌ఆర్‌ఐలు, వ్యాపార, పారిశ్రామికవేత్తలతో సీఎం విడి విడిగా భేటీ అయ్యారు.
తెలంగాణ పెట్టుబడులకు అన్ని విధాలా అనుకూలమని, తమ ప్రభుత్వం సుస్థిరమైన విధానాలను అమలు చేస్తున్నదని సీఎం వివరించారు. హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు బాటలు వేశామని తెలిపారు. పెట్టుబ డులతో తెలంగాణకు వస్తే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసినట్లేనని, తద్వారా నవ ప్ర పంచాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు.
తెలంగాణకు జపాన్ మధ్య చక్కటి సంబంధాలున్నాయని, దీనిలో భాగంగానే వాణిజ్య సంబంధాలను మరింత విస్తృత పరిచి సరికొత్త అధ్యాయాన్ని లిఖిద్దామన్నారు. ప్రపం చస్థాయి ఎక్స్‌పో తెలంగాణ నుంచి తాము పాలుపంచుకోవడం ఆనందాన్నిచ్చిందని వెల్లడించారు.
పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ అనుకూలం: మంత్రి శ్రీధర్‌బాబు
ఐటీ, బయో టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉందనిఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కొనియాడారు. ఎయిరో స్పేస్, ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్ రంగా ల పరిశ్రమల స్థాపనకూ రాష్ట్రం అనుకూలమని పేర్కొన్నారు. ఎకో, ఎనర్జీ, స్మార్ట్ మొబి లిటీ, సర్క్యులర్ ఎకానమీ టార్గెట్‌తో తమ ప్రభుత్వం హైదరాబాద్‌లో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నదని వెల్లడిం చారు.
నగరం చుట్టూ చుట్టూ 370 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్), రేడియల్ రోడ్లతో పాటు ఆర్‌ఆర్‌ఆర్‌కు ఔట ర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) మధ్య ఉన్న జోన్ ఎలక్ట్రిక్ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్, ఎయిరో స్పేస్ పరిశ్ర మలకు అనకూలమన్నారు. ఇక్కడ తయారైన ఉత్పత్తుల ఎగుమతులకు వీలుగా డ్రైపో ర్ట్ నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు.
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్‌లో భాగంగా నది పొడవునా 55 కిలోమీటర్ల మేర అర్బన్ గ్రీన్ వేను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అందుకు టోక్యో, ఒసాకా నగరాలను ఆదర్శంగా తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, రైజింగ్ టీం సభ్యులు పాల్గొన్నారు.