calender_icon.png 19 April, 2025 | 9:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇది కాంగ్రెస్ తెచ్చిన కృత్రిమ కరువు

17-04-2025 12:25:00 AM

రోడ్లపై మళ్లీ బిందెలు, డ్రమ్ములు దర్శనమిస్తున్నయ్..

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు..

హైదరాబాద్ (విజయక్రాంతి): కేసీఆర్ ఇంటింటికి నల్లాలు ఏర్పాటు చేసి తాగు నీళ్లిస్తే, రేవంత్ సర్కార్ కనీసం ఆ పథకాన్ని కొనసాగించలేకపోతుందని బుధవారం ఎక్స్‌వేదికగా హరీశ్‌రావు మండిపడ్డారు. ఉమ్మడి పాలన నాటి బిందెలు, డ్రమ్ములు మళ్లీ రోడ్లపై కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదనీ, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కృత్రిమ కరువు అని, రేవంత్ పాలనా వైఫల్యం తెచ్చిన ప్రజల కన్నీటి కరువు అని హరీశ్‌రావు విమర్శించారు. ఇకనైనా సీఎం, మంత్రులు అబద్ధాల ప్రవాహాన్ని పారించడం ఆపి, ప్రజల ఇళ్లకు తాగునీటిని పారించాలని సూచిస్తున్నామన్నారు.