19-03-2025 11:20:12 PM
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ భొజ్జు పటేల్..
ఖానాపూర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ రాష్ట్రంలో సబ్బండ వర్గాల ప్రజల అభివృద్ధికి బాటలు వేస్తుందని, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ అన్నారు. వార్షిక బడ్జెట్ను ఉద్దేశించి బుధవారం ఖానాపూర్ విలేకరులతో మాట్లాడారు. ఈ మేరకు గిరిజన సంక్షేమానికి 17169 కోట్లు, కేటాయించడం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, సంక్షేమానికి ఆశాజనకంగా నిధులు కేటాయించడం హర్షనీయమని అన్నారు.