calender_icon.png 4 April, 2025 | 6:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇది హెచ్‌సీయూ విద్యార్థుల విజయం

04-04-2025 12:54:42 AM

బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ 

హైదరాబాద్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): కంచ గచ్చిబౌలి పర్యావరణ పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్‌ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ఇది హెచ్‌సీయూ విద్యార్థుల విజయమని పేర్కొన్నారు. విద్యార్థుల నిస్వార్థ నిరంతర స్ఫూర్తివంతమైన పోరాటం వల్లనే సానుకూల తీర్పు వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. కంచ గ చ్చిబౌలి భూముల పరిరక్షణ కోసం మద్దతు ఇచ్చిన వారందరికీ కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. 

రేవంత్ చర్యలకు ఇది చెంపపెట్టు: హరీశ్‌రావు 

ఎమ్మెల్యే హరీశ్ రావు హెచ్‌సీ యూ భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు నిర్ణయం ఆహ్వానించదగ్గ విషయమని మాజీ మంత్రి హరీ శ్ రావు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దుందుడుకు చర్యలకు ఇది చెంపపెట్టు లాంటిదని ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు.

ఇది విద్యార్థుల, పర్యావరణ ప్రేమికుల, సామాజిక వేత్తల విజయమని తెలిపారు. నిన్న పార్టీ ఫిరాయింపుల విషయంలో.. నేడు హెచ్‌సీయూ భూముల విషయంలో సుప్రీం మొట్టికాయలు వేసిందని విమర్శించారు. పర్యావరణాన్ని కాపాడడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందినప్పుడు న్యాయస్థానం మార్గదర్శకంగా ఉండడం శుభ పరిణామమన్నారు.