calender_icon.png 8 November, 2024 | 6:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇది వాస్తవ కథ

05-11-2024 12:00:00 AM

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగు హీరో అయిపోయారా అంటే, టాలీవుడ్ వర్గాల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. ‘మహానటి’, ‘సీతారామం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్, ‘లక్కీ భాస్కర్’తో టాలీవుడ్‌లో తనదైన స్థానాన్ని పదిలపర్చుకున్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన చిత్రమే ‘లక్కీ భాస్కర్’.

దీపావళి సందర్భంగా విడుదలై ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోందీ సినిమా. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన కథానాయకుడు దుల్కర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. “నేను ఎప్పటినుంచో వాస్తవానికి దగ్గరగా ఉండే ఒక మధ్యతరగతి తండ్రి పాత్ర చేయాలనుకున్నా. అది ఈ సినిమాతో నెరవేరింది. నా దృష్టిలో ఇది వాస్తవ కథ.

బ్యాక్‌గ్రౌండ్‌లో హర్షద్ మెహతా లాంటివాడు భారీ స్కాం చేస్తుంటే, ఒక చిన్న బ్యాంక్ ఉద్యోగి తన పరిధిలో స్కాం చేయడం కొత్త పాయింట్. సినిమా కోసం వెంకీ ఎంతో రీసెర్చ్ చేశాడు. బ్యాంకింగ్ సెక్టార్‌కు చెందినవారూ ఎలాంటి తప్పులూ లేవని చెప్పడం విశేషం. ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. నటుడిగా అన్నిరకాల పాత్రలూ చేయాలి. షారుఖ్ ఖాన్ లాంటివారు కూడా నెగెటివ్ షేడ్స్ పాత్రలు చేశారు.

నటుడిగా ఇలాంటి పాత్రలు సంతృప్తినిస్తాయి. ప్లాన్ చేస్తే విజయాలు రావు. అందరం మంచి కథలు చెప్పాలి, మంచి సినిమాలు చేయాలనే అనుకుంటాం. నేనూ అలాగే ముందుకెళ్తున్నా. కష్టానికి తగ్గ ఫలితం దక్కడం సంతోషంగా ఉంది. మమ్ముట్టి కొడుకునైనా, నేనూ సాధారణ యువకుల్లాగానే ఆలోచిస్తా. యువకుడిగా ఉన్నప్పుడు లాటరీ తగిలితే, సొంతంగా నాకు నచ్చినవన్నీ కొనుక్కోవచ్చని కలలు కనేవాడిని. 

నాతో ఏమీ చెప్పలేదు. కానీ, దర్శకుడు వెంకీతో మాట్లాడి ప్రత్యేకంగా అభినందించారు. ఏదైనా కొత్త కథ విని నచ్చితే, ఇద్దరం దాని గురించి మాట్లాడుకుంటాం. నాకు బాగా నచ్చిన కథల గురించి ఆయనకు చెబుతుంటా. మమ్ముట్టి పలు తెలుగు సినిమాల్లో నటించారు. నేను తెలుగులో చేస్తున్న విషయం ఆయనకు చెప్తే.. బ్యూటిఫుల్ ల్యాంగ్వేజ్ అని చెప్పారు.

తెలుగు ప్రేక్షకుల ప్రేమ చూసి మొదట నేను ఆశ్చర్యపోయా. ‘మహానటి’ నుంచి తెలుగు ప్రేక్షకులు ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. ‘సీతారామం’ చేయడానికి ఎక్కువ గ్యాప్ తీసుకున్నప్పటికీ, ఆ ప్రేమ పెరిగింది తప్ప తగ్గలేదు.  అలా ఏమీ లేదు.. అన్ని పాత్రలూ చేయాలనుంది. తెలుగులో ‘ఆకాశంలో ఒక తార’ సినిమా చేస్తున్నా. అది కూడా ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది” అని తెలిపారు.