calender_icon.png 9 February, 2025 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇది ఓసీడీ లక్షణం

09-02-2025 12:17:12 AM

ఉదయం లేవగానే అద్దంలో ముఖాన్ని చూసుకోవడం.. రాత్రి పడుకునే ముందు పలుమార్లు అదే పనిగా అద్దంలో ముఖాన్ని చూసుకోవడాన్ని మానసిక సమస్యగా చెబుతున్నారు నిపుణులు. ఈ సమస్య ఉన్నవారు ముఖం కడుక్కున్నప్పుడు, తల దువ్వుకునేటప్పుడు ఇలా పలు సందర్భాల్లో అద్దంలో చూసుకుంటారు.

అయితే ఎక్కువసార్లు అద్దంలో ముఖం చూసుకుంటే మిర్రర్ చెకింగ్ సమస్య ఉన్నట్లేనని నిపుణులు చెబుతున్నారు. ఇది పూర్తిగా ప్రవర్తనపై ప్రభావితం చూపుతుంది. దీన్ని సైన్స్ పరిభాషలో డైస్మోర్ఫిక్ డిజార్డర్‌గా పిలుస్తారు. ఇదొక రకమైన మానసిక ఆరోగ్య సమస్య. ఈ సమస్యతో బాధపడేవారు తమ గుర్తింపు కోసం తరచుగా ఆందోళన పడుతుంటారు.

పదేపదే అద్దంలో ముఖాన్ని చూడటం అనేది మెదడుకు సంబంధించిన మానసిక సమస్య అంటున్నారు నిపుణులు. దీన్నే ఓసీడీగా చెబుతారు. అద్దంలో ఎక్కువసార్లు చూసుకునే వారు ఒంటరితనానికి, నలుగురితో కలవడానికి ఆసక్తి చూపించరు. కుటుంబ సభ్యులకు దూరమవుతుంటారు. ఓ అంచనా ప్రకారం సుమారు పది లక్షల మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది.