calender_icon.png 7 November, 2024 | 9:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎవరూ టచ్ చేయిని కథ ఇది

06-11-2024 12:00:00 AM

రాకేశ్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం ముఖ్యతారాగణంగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మైథాలాజికల్ థ్రిల్లర్ ‘రహస్యం ఇదం జగత్’. ఈ చిత్రానికి కోమల్ ఆర్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల నిర్మిస్తున్నారు. నవంబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా చిత్ర దర్శకుడు కోమల్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు.

“శ్రీచక్రం గురించి అన్వేషణలో భాగంగా అమెరికాలో జరిగిన తవ్వకాల సంఘటన నన్ను బాగా ప్రభావితం చేసింది. అందుకే మన పురాణాల కథకు ఫిక్షన్‌ను యాడ్ చేసి కథ చెప్పాలనుకున్నా. హనుమంతుడు ఒక లోకం నుంచి ఇంకో లోకానికి ప్రయాణించాడు.. దీని వెనుక వామ్‌హోల్ అనే కాన్సెప్ట్ ఉంది.

హనుమంతుడు సాధన చేసి దేవుడయ్యాడు. ఇలా సాధారణ మనుషులకు జరిగితే మన కథలు ఎలా మారతాయనేదే ఈ సినిమా. ఇలాంటి కథలకు కొత్తవాళ్లే కరెక్ట్. అందుకే సినిమాలో అందరూ కొత్తవాళ్లే కనిపిస్తారు. ఇంకా నా దగ్గర మంచి కథలున్నాయి. ఏ సినిమా తీసినా ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని కథలతోనే సినిమా చేస్తా” అని అన్నారు కోమల్.