హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘జీబ్రా’. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎన్‌రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేశ్ సుందరం నిర్మిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిషినాటో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరో సత్యదేవ్ గురువారం విలేకరుల ముచ్చటిస్తూ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు.
‘జీబ్రా’ టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి?
-జీబ్రా.. బ్లాక్ అండ్ వైట్‌కు మెటాఫర్. బ్లాక్ మనీ, వైట్ మనీ చుట్టూ జరిగే కథ ఇది. చివరివరకూ ఎవరు మంచి, ఎవరు చెడు అనేది తెలియదు. ప్రతిఒక్కరిలో గ్రే ఉంటుం ది. అందుకే టైటిల్ ఫాంట్‌కి గ్రే పెట్టి, సినిమాకు జీబ్రా అనే టైటిల్ పెట్టారు. నాలు గు భాషల్లో రిలీజ్ అవుతున్న సినిమా ఇది. అన్ని రకాలుగా జీబ్రా టైటిల్ యాప్ట్.
బ్యాంక్ క్రైమ్ నేపథ్యంలో ఇటీవల ‘లక్కీ భాస్కర్’ వచ్చింది కదా.. దానికి, దీనికి డిఫరెన్స్ ఏమిటి?
-లక్కీ భాస్కర్ పిరియడ్ కథ. జీబ్రా కాంటెంపరరీ స్టొరీ. బ్యాంకర్ అనే క్యారెక్టర్ తప్పితే దానికి, దీనికి సంబంధం లేదు. ఇప్పుడు బ్యాంక్ సిస్టం అంతా డిజిటల్ అయ్యింది. ఇప్పుడు క్రైమ్ చేయడం అంత ఈజీ కాదు. బ్యాంక్‌లో పనిచేసే వాళ్లకు తప్పితే సామాన్యులకు అక్కడ జరిగే మిస్టేక్స్ తెలియవు. దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ గతంలో బ్యాంక్‌లో పనిచేశారు. ఆయన చూసిన ఇన్సిడెంట్స్‌తోపాటు ఇంకొన్ని ట్రూ ఇన్సిడెం ట్స్‌తో ఈ కథను రాశారు.
-ఏటీఎంలో డబ్బు లు తీసినప్పుడు ఓ సౌండ్‌తో డబ్బులు బయ టికి వస్తాయి. ఆ సౌండ్ వెనుక ఏం జరుగు తుందనేదే ఈ సినిమా. ఇందులో నేను బ్యాంక ర్‌ను. ధనుంజయ గ్యాంగ్‌స్టర్. ఈ జర్నీలో మేమిద్దరం చాలా క్లోజ్ అయ్యాం. పుష్పలో జాలీరెడ్డి పాత్ర తనకు మంచి పేరు తీసుకొ చ్చింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఇంకా దగ్గరవుతాడు.
ఈశ్వర్ కార్తీక్ కథ చెప్పినప్పుడు ఎలా అనిపించింది?
-ఈ కథ విన్నప్పుడు మైండ్ బ్లోయింగ్‌గా అనిపించింది. ఇంత గొప్ప కథ మనదగ్గరికి వచ్చినప్పుడు కచ్చితంగా చేయాలని విన్నపుడే ఫిక్స్ అయ్యా. -నాకు కామన్ మ్యాన్ రోల్స్ ఇష్టం. ఇప్పటివరకు దాదాపు సీరియస్ రోల్స్ చేశాను. దాన్ని బ్రేక్ చేద్దామని దర్శకుడు ఈశ్వర్ కూడా భావించారు. ఇందులో చాలా కొత్త సత్యదేవ్‌ని చూస్తారు.
మంచి సినిమా పడితే నెక్స్ లెవెల్‌లో ఉంటారని చిరంజీవి అన్నారు.. జీబ్రా మీకు అలాంటి సినిమా అవుతుందా?
-అవుతుంది. నిన్న కొంత మంది సినిమా చూశారు. చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. -అన్నయ్య (చిరంజీవి) జపాన్ వెళ్లా రు. రాగానే తప్పకుండా చూస్తారు. అన్నయ్య స్ఫూర్తితో పరిశ్రమలోకి వచ్చా. ఆయన గుడ్ బుక్స్‌లో నేనుండటం అదృష్టంగా భావిస్తున్నా.
కొత్త ప్రాజెక్ట్స్ గురించి?
‘ఫుల్ బాటిల్’ అవుట్ అండ్ అవుట్ ఫన్ ఫిల్మ్. వెంకటేశ్ మహాతో ఓ సినిమా ఉంటుంది. చాలా గ్రేట్ స్టొరీ కుదిరింది.