02-04-2025 12:00:00 AM
ఎమోషనల్ థ్రిల్లర్ లవ్‌స్టోరీగా రూపుదిద్దుకుంటున్న తాజాచిత్రం ‘28డిగ్రీ సెల్సియస్’. నవీన్‌చంద్ర, షాలినీ వడ్నికట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘పొలిమేర’ ఫేమ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్ తన మొదటి సినిమాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో ఇండస్ట్రీకి నిర్మాతగా పరిచయమవుతున్నారు సాయి అభిషేక్. వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారాయన.
ఈ సినిమా ఏప్రిల్ 4న థియేటర్ల ద్వారా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో యంగ్ ప్రొడ్యూసర్ సాయి అభిషేక్ విలేకరులతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. “28 డిగ్రీ సెల్సియస్’ అనే టెంపరేచర్ పాయింట్‌తో అనిల్ విశ్వనాథ్ చెప్పిన కథ నన్ను ఆకట్టుకుంది. మొదట వేరే హీరోలను అనుకున్నా.. నవీన్ చంద్రకే బాగుంటుందనే నిర్ణయించాం. ఫస్ట్ అనుకున్న హీరోయిన్ అంజలి.
కానీ, ట్రెండీ గా కొత్త ఫేస్ ఉంటే బాగుంటుందని షాలినీని తీసుకున్నాం. 28 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ దాటితే హీరోయిన్‌కు ప్రాణాపాయం. అలాంటి పరిస్థితిని ఈ జంట ఎలా ఎదుర్కొన్నారనేది ఆసక్తికరం. ఇది ఒకే జానర్‌లో సాగే సినిమా కాదు. డిఫరెంట్ జానర్లలో వెళ్లే ఒక ఇంటెన్స్ లవ్‌స్టోరీ. మూవీ చేసే క్రమం లో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. సినిమా ప్రారంభించినప్పుడే నా కాలు ఫ్రాక్చర్ అయ్యింది.
తర్వాత జార్జియాలో షూటింగ్‌కు అధికారులు అనుమతి ఇవ్వక సమస్యలు ఎదుర్కొన్నాం. ఎన్ని సమస్యలు వచ్చినా కంటెంట్ మీద నమ్మకంతో ఇప్పటిదాకా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఇంకా కొన్ని కథలు విన్నా, ఏదీ ఫైనలైజ్ చేయలేదు. ఈ సినిమా రిలీజ్ తర్వాత మా సంస్థ నుంచి కొత్త ప్రాజెక్టును ప్రకటిస్తాం” అన్నారు.