04-03-2025 12:07:27 AM
ప్రధాన ప్రతిపక్షం బీజేపీయేనని తేలింది
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్
కరీంనగర్, మార్చి 3 (విజయక్రాంతి): కరీంనగర్ నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్యను గెలిపించిన ఉపాధ్యాయులు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్ల నమ్మకంతోనే ఈ తీర్పు వచ్చిందన్నారు. ఈ తీర్పును టీచర్లకు, మోదీకే అంకితమిస్తున్నట్లు చెప్పారు.
టీచర్ ఎమ్మెల్సీగా భారీ విజయం సాధించి, గెలుపుపత్రాన్ని అందుకున్న మల్క కొమరయ్యను అభినందించేందుకు కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియం వద్దకు బండి సంజయ్ వచ్చారు. ఈ సందర్భంగా మల్క కొమురయ్యను ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, మాజీ మేయర్ సునీల్‌రావు, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి జే సంగప్ప, తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు అభినందించారు.