calender_icon.png 20 November, 2024 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరెంట్ సరఫరా చేతకాని ప్రభుత్వం ఇది

20-11-2024 12:53:19 AM

  1. అపార్ట్‌మెంట్‌లో సొంతంగా ట్రాన్స్‌ఫార్మర్లా 
  2. గ్రేటర్ ప్రజలపై అదనంగా 300 కోట్ల భారం 
  3. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ 

హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): పెరిగిన విద్యుత్ వినియోగానికి అనుగుణంగా నిర్వహణ చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై భారం వేసే తుగ్లక్ చర్యకు పూనుకుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు మండిపడ్డారు. నగరంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని, దానికి ప్రజలే సొంతం గా ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొనడం సిగ్గుచేటని అన్నారు.

అపార్ట్‌మెంట్లలో విద్యుత్ వినియోగం 20 కిలోవాట్ దాటితే ఆ అపార్ట్‌మెంట్ వాసులే సొంతంగా ట్రాన్స్ ఫార్మర్ ను ఏర్పాటు చేసుకోవాలని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ నోటీసులు ఇవ్వడంపై విమర్శించారు. 20 కేవీల విద్యుత్ లోడ్ దాటిన అపార్ట్ మెంట్ లో సొంతంగా ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసుకోవాలంటే ఒక్కో అపార్ట్ మెంట్ కు దాదాపు రూ. 3 లక్షలు అవసరమవుతాయని చెప్పా రు.

అంటే ఒక్కో కుటుంబంపై 30 నుంచి రూ. 50 వేలు భారం వేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు. హైదరాబాద్ లో 20 కేవీ పైగా విద్యుత్ వినియోగం చేసే అపార్ట్ మెంట్ లలో కొత్తగా ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేసుకుంటే ప్రజలపై రూ. 300 కోట్ల భారం పడుతుందని చెప్పారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ప్రజల జేబులకు రూ. 300 కోట్లు చిల్లు పెట్టాలని చూస్తోందని మండిపడ్డారు.

భవిష్యత్‌లో వినియోగం పెరిగిందంటూ పైప్ లైన్లు, రోడ్లను కూడా ప్రజలే వేసుకోవాలంటారా? అని ప్రశ్నించారు. ప్రజలకు మౌలిక వసతుల కల్పన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని రేవంత్‌రెడ్డి మరిచిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు.