22-02-2025 12:00:00 AM
ఎమ్మెల్యే బొజ్జు పటేల్
ఆదిలాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): ప్రజా పాలనలో గిరిజన ఆదివాసీ గ్రామాల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఉట్నూర్ సుద్దగుడ లో మొదటి విడత కింద లబ్ధిదారులకు 150 ఇందిరమ్మ ఇండ్ల పత్రాలను శుక్రవారం లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యేకి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో ఆరు గ్యారంటీలు ఇంటి ఇంటికి అమలవుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొదటి విడతలో మండలానికో గ్రామానికి ఆరు గ్యారంటీలు అమలయ్యాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.