calender_icon.png 7 January, 2025 | 12:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇది కోతల ప్రభుత్వం

05-01-2025 02:13:20 AM

  • ఎకరాకు 15 వేలు ఇస్తామని మాట తప్పారు

రైతులకిచ్చిన అన్నీ హామీల్లో కోతలేనా?

12 వేల రైతు భరోసాపై కేంద్రమంత్రి బండి సంజయ్ ధ్వజం

హైదారబాద్, జనవరి 4 (విజయక్రాం తి): ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో ఎకరాకు రూ.12 వేలు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడం దుర్మర్గమని, కాంగ్రెస్ చేతల ప్రభుత్వం కాదని, కోతల ప్రభుత్వమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజ మెత్తారు. దొంగ హామీలు ఇచ్చి, ఆ తర్వాత ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే ఉందని శనివారం ఓ ప్రకటనలో ఆరోపించారు.

మ్యానిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలకు, నేడు ముఖ్యమంత్రి చేసి న మాటలకు పొంతనే లేదన్నారు. రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామని ప్రకటించి, అందుకు భిన్నంగా రూ.12 వేలు మాత్రమే ఇస్తామనడం రైతులను దగా చేయడమే అవుతుందన్నారు. రుణమాఫీ, రైతు భరోసా సహా రైతులకిచ్చిన అన్నీ హామీల అమలులో కోతలు విధిస్తున్నారని వాపోయారు.

ఇందిరమ్మ పాలన అంటే.. ఇంటింటా మోసం చేయడమేనా అని ప్రశ్నించారు. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నాయా పైసా సాయం చేయలేదన్న విషయం తేటతెల్లమైందన్నారు. రైతు కూలీలకు రూ.12 ఇస్తామని హామీ ఇచ్చి పూర్తి విస్మరించడం సరికాదన్నారు. 22 లక్షల మందికిపైగా రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టారని ఆరోపించారు.