- మేడిగడ్డపై కాంగ్రెస్ అసత్య ప్రచారం
- మాజీ ఎంపీ వినోద్‌కుమార్
హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): ‘ఎస్‌ఆర్‌ఎస్పీ ఫేజ్ ఫేజ్ నీళ్లు ఇవ్వలేమని, యాసం గి పంట తక్కువ సాగు చేసుకోవాలని రైతులకు అధికారులు చెబుతు న్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యం’ అని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ ఎం పీ వినోద్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులకు యాసంగి పంట ముఖ్యమైనదని, నీళ్లు అవసరమైన ఈ సమయంలో ప్రభుత్వం మేడిగడ్డపై ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం నిర్వహించిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడారు.
భూకంపం వచ్చినా మేడిగడ్డ కు ఏం కాలేదని, కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే ప్రాజెక్టు కుంగిందని కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, రూప్‌సింగ్ పాల్గొన్నారు.