10-04-2025 12:00:00 AM
టీవీ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటిస్తున్న చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. దీన్ని యువ దర్శక ద్వయం డుయో నితిన్, భరత్ మాంక్స్‌అండ్‌మంకీస్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. దీపికా పిల్లి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో ప్రదీప్ మాచిరాజు విలేకరులతో సినిమా విశేషాల్ని తెలి పారు.
“యాంకర్‌గా, యాక్టర్‌గా ఒక్క సారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పు డు నాపై మరింత బాధ్యత పెరిగిందనిపిస్తోంది. లక్షల్లో ఒక్కరికే లభించే అవ కాశంగా భావిస్తున్నా. సినిమా అంటే పాషన్ ఉన్న వాళ్లందరూ కలిసి ఒక అవకాశాన్ని సృష్టించుకున్నాం. చాలా కథలు విన్నాం. అదృష్టం కొద్దీ ఈ కథ దగ్గర ఆగాం. దీన్ని ఒక చందమామ కథలా చూడొచ్చు. అనగనగా ఒక ఊరు.. అక్కడ ఓ అమ్మాయి.
ఆ ఊరికి వెళ్లిన ఒక సివిల్ ఇంజినీర్. ఆ ఊర్లో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఆ రూల్స్ మధ్య హీరో ఎలా ఇరుక్కున్నాడనేది చాలా ఆసక్తికరంగా చూపిస్తున్నాం. కథ అనుకున్నప్పుడే ఈ టైటిల్ అనుకున్నాం. పవన్‌కళ్యాణ్ డెబ్యూ సినిమా టైటిల్‌తో మూవీ చేసే క్రమంలో మాపై బాధ్యత పెరిగింది. నేను కృష్ణ అనే పాత్రలో కనిపిస్తా. ఆ క్యారెక్టర్ పడే కష్టాలు ఆసక్తికరం. నేను ఎంత చిరాకు పడితే ప్రేక్షకులకు అంత వినోదం.
డైరెక్టర్స్ నితిన్, భరత్ నాతో ఎప్పటినుంచో జర్నీ చేస్తున్నారు. నా టైమింగ్ వాళ్లకు తెలుసు. దానికి తగ్గట్టుగా ఈ కథ అందంగా మలిచారు. ఫస్ట్ కాపీ చూసినప్పుడు కొత్తవారితో పనిచేసినట్టు అనిపించలేదు. యువ దర్శకులకు స్ఫూర్తిగా నిలుస్తారు. హీరోయిన్ పాత్ర కోసం తెలుగమ్మాయే కావాలని ఆడిషన్స్ చేశాం. చివరగా దీపికను లుక్‌టెస్ట్, వర్క్‌షాప్ చేసి తీసుకున్నారు.
ఈ సినిమాలో ప్రతి సాంగ్ డిఫరెంట్ జోనర్‌లో చేశారు. రదన్ మంచి ఆల్బమ్ ఇచ్చా రు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంటుంది. బాల్‌రెడ్డి బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. కథలో కామెడీ ఉన్న సిని మా చేసి చాలా కాలమైందని బ్రహ్మానందం మాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. -మైత్రి మూవీ మేకర్స్ సినిమా చూసిన వెంటనే డీల్ క్లోజ్ చేశారు. ఫ్యామిలీ సినిమా అని సమ్మర్ రిలీజ్ డేట్‌ను వారే లాక్ చేశారు” అని చెప్పారు.