శ్రీలీల డ్యాన్స్‌కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా యూ త్ ఆమె డ్యాన్స్‌ను బాగా ఇష్టపడతారు. ప్రస్తుతం ఆమె ‘పుష్ప ది రూల్’ లో ఐటమ్ సాంగ్‌లో స్టెప్పులేశారు. ఇటీవలే దీని షూటింగ్లో కూడా శ్రీలీల పాల్గొన్నారు. ఈక్రమంలోనే ఆమె అల్లు అర్జున్ను ఉద్దేశించి నెట్టింట ఓ పోస్ట్ పెట్టారు. “బన్నీ సర్.. మీపై ప్రేమ, గౌరవంతో ఈ నోట్ పంపిస్తున్నా. మీతో పని చేయడం నాకు ఒక అందమైన అనుభూతి. ఇలాంటి ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభూతిని నాకు అందించనందుకు ధన్యవాదాలు.
ఈ ఐదారు రోజులు నాకో క్రాష్ కోర్సు లా ఉంది. ఇది కేవలం ఆరంభమే” అని శ్రీలీల పేర్కొన్నారు. దీనిపై అల్లు అర్జున్ కూడా స్పందించారు. “థాంక్యూ మై డియర్. నీ మాటలు నా మనసును టచ్ చేశాయి. నువ్వు మరెన్నో విజయాలు అందుకోవాలి” అని తెలిపా రు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘ఫుష్ప ది రూల్’ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటించారు.
పుష్పకు కొనసాగిం పుగా ఈ చిత్రం రూపొందుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సిండికేట్‌గా మారిన తర్వాత పుష్ప ఎదుర్కొన్న సవాళ్లను ఇతివృత్తంగా తీసుకుని ఈ చిత్రం రూపొందింది.