calender_icon.png 26 December, 2024 | 1:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ గ్యాంగ్‌స్టర్ ప్రేమ స్వచ్ఛమైనది!

26-12-2024 01:51:42 AM

స్టార్ హీరో సూర్య ప్రస్తుతం ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘సూర్య 44’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శక త్వం వహిస్తున్నారు. సూర్య, సుబ్బరాజ్‌ల ఫస్ట్ కొలాబరేషన్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని సూర్య తన 2డీ ఎంటర్ టైన్‌మెంట్ బ్యానర్‌పై స్వయంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ఇంటెన్స్ యాక్షన్, రొమాన్స్, భావోద్వేగాలతో కూడిన గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతోంది. ముఖ్యంగా ప్రేమ, యుద్ధం నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు ‘రెట్రో’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ క్రిస్మస్ సందర్భంగా మేకర్స్ టీజర్ ను విడుదల చేశారు.

టీజర్‌లో ‘నీ ప్రేమ కోసం రౌడీయిజాన్ని వదిలేస్తున్నా.. నా ప్రేమ స్వచ్ఛమైనది’ అంటూ సూర్య చెప్తున్న డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. జయరామ్, కరుణాకరన్, జోజు జార్జ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు డీవోపీ: శ్రేయాస్ కృష్ణ; సంగీతం: సంతోష్ నారాయణన్; ఎడిటర్: మహమ్మద్ షఫీక్ అలీ.