19-02-2025 12:00:00 AM
స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పథ్వి పొలవరపు నిర్మాణంలో తెరకెక్కుతున్న ద్విభాష చిత్రం ‘రామం రాఘవం’. నటుడు ధనరాజ్ మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఫిబ్రవరి 21న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్‌లో నటుడు సముద్రఖని మాట్లాడుతూ.. “ఈ కథ జెన్యూన్ అని నమ్మిన తర్వాత ఒప్పుకున్నా. జెండాపై కపిరాజు షూటింగ్‌లో నేను తొలిసారి ధనరాజ్‌ని చూశా. ధనరాజ్ ఈ చిత్ర కథని రెండు లైన్స్‌లో చెప్పినప్పుడే బలమైన కథ అనిపించింది” అని సముద్రఖ అన్నారు.
ధనరాజ్ మాట్లాడుతూ.. “అరిపాక ప్రభాకర్ గారు లేకపోతే ఈ చిత్రం లేదు. ఈ చిత్ర కథ ప్రేక్షకులని ఏడిపించేలా ఉంటుందని అందరూ అంటున్నారు. కావాలని ఏడిపించడానికి ఈ చిత్రం చేయలేదు.
కాకపోతే ప్రతి సన్నివేశం ప్రతి కుటుంబంలో ఏదో ఒక సందర్భంలో జరిగే ఉంటుంది” అన్నారు. చిత్ర నిర్మాత పథ్వీ పోలవరపు మాట్లాడుతూ.. “ఈ చిత్రం కథ విన్న రోజు నుంచి ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రివ్యూ చూసే వరకూ నాకు ఈ మూవీ ఒక అద్భుతమైన ఎమోషనల్ జర్నీ. ‘రామం రాఘవం’ చిత్రం రిలీజ్ తర్వాత ధనరాజ్ పోస్టర్ పై బిజినెస్ జరిగే రోజు వస్తుంది” అని అన్నారు.