01-04-2025 02:31:29 AM
టీవీ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన తాజాచిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. ఈ యూనిక్ లవ్‌అండ్‌ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను యువ దర్శకులు డుయో నితిన్, భరత్ తెరకెక్కిస్తున్నారు. మాంక్స్‌అండ్‌మంకీస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమాలో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది. ఏప్రిల్ 11న విడుదల కానున్న ఈ సినిమా నుంచి ఇప్ప టికే విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన దక్కింది. సోమవారం మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
హైదరాబాద్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో ప్రదీప్ మాట్లాడుతూ.. “మా టీవీ షోస్ చూసి ఆడియన్స్ అందరూ ఎలా వినోదం పొందారో అలాగే ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాను కూడా అంతే గొప్పగా ఎంజాయ్ చేస్తారు. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. చాలా సరదాగా ఉంటుంది. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేయడానికి ఈ సినిమా ఒక మెట్టు అవుతుందని భావిస్తున్నాం” అన్నారు. హీరోయిన్ దీపిక పిల్లి మాట్లాడుతూ... ‘ఇది నా ఫస్ట్ డెబ్యూ ఫిలిం.
ఈ సినిమా నా మనసుకు చాలా నచ్చింది. ఇందులో చాలా స్పెషల్ క్యారెక్టర్‌లో నటించాను. చాలా ఎంజాయ్ చేస్తూ నటించాను’ అని చెప్పింది. దర్శక ద్వయం భరత్, నితిన్ మాట్లాడుతూ.. ‘ఇది బ్యూటిఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్’ అని తెలిపారు.