14-02-2025 01:49:50 AM
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 13 (విజయ క్రాంతి): న్యాయవాదులంతా తాము వాది స్తున్న కేసులతోపాటు కోర్టుకు సంబం ధించిన పత్రాలు అన్ని ఆన్లున్ విధానంలోనే ఈ ఫైలింగ్ అమలు చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో జిల్లా బార్ అసోసియేషన్ సభ్యులందరికీ ఈ ఫైలింగ్ విధానంపై అవగాహన కల్పించారు.
ఈ ఫై లింగ్ వల్ల సమయాభావం, ఖర్చులు కూడా తగ్గుతుందని న్యాయవాది తన ఆఫీసు నుం చి ఈ ఫైలింగ్ చేసు కోవచ్చునాన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సభిత, జూనియర్ సివిల్ జడ్జిలు పి.మౌనిక, కావ్య, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎన్.శ్రీనిధి, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి పరిధిలోని బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.