24-02-2025 07:08:20 PM
ఇక కేసులన్నీ డిజిటలైజేషన్..
కొత్తగూడెం (విజయక్రాంతి): ఇప్పటినుంచి కేసులన్నీ ఈ ఫైలింగ్ ద్వారానే నిర్వహించడం జరుగుతుందని జిల్లా సెషన్ జడ్జ్ పార్టీలు వసంత్ అన్నారు. సోమవారం ఈ ఫైలింగ్ 3.0 పై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన ట్రైనింగ్ ప్రోగ్రాంలో, రాష్ట్ర ట్రైనీస్ ముప్పు రవీంద్రారెడ్డి, సాముల రోహిత్ రెడ్డి శిక్షణలో భాగంగా మాట్లాడుతూ... ఈ -ఫైలింగ్ ద్వారా కేసులు దాఖలు చేయడానికి డిజిటల్ రూపంలో మార్చే ప్రక్రియను ఆన్లైన్లోనే దావాలు, పిటిషన్లు, డాక్యుమెంట్లు, కోర్టు ఫీజులు, సివిల్ అప్పీలు, ఇతర సివిల్, క్రిమినల్ కేసులు సబ్మిట్ చేయవచ్చని, ఇది ఒక ఆధునిక వర్షన్ అని, ఇది మరింత వేగవంతంగా,సురక్షితంగా, సులభంగా, నడిచే ప్రక్రియ అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి న్యామూర్తులు బత్తుల రామారావు, ఏ. సుచరిత, కె. సాయి శ్రీ పాల్గొన్నారు. కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ ఉపాధ్యక్షుడు తోట మల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎంఎస్ఆర్ రవిచంద్ర, కార్యవర్గ సభ్యులు సాధిక్ పాషా, ఎస్. ప్రవీణ్ కుమార్ దూదిపాల రవికుమార్, సీనియర్ జూనియర్ మహిళ న్యాయవాదులు పాల్గొన్నారు.