మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై నమోదవుతున్న అవినీతి కేసులతో ప్రజలు అవాక్కవుతున్నారు. కవితపై ఈడీ లిక్కర్ కేసు తో సంచలనం రేకెత్తగా, తాజాగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పైనా కేసు నమోదవ్వడంతో ఆ కుటుంబంతో ఈ‘ఢీ’ అంటున్నదా అన్న చర్చ మొదలైంది.
లిక్కర్ కేసులో కవితను ఈడీ అరెస్టు చేసి తీహార్ జైలుకు కూడా పంపించగా.. ఇప్పుడు ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్‌ను విచారించనుండటం సంచలనంగా మారింది. ఈ ఏడాదే రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖలో అక్రమ జీఎస్టీ ఎగవేతకు సంబంధించి ఈడీ కేసు నమోదు చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా విచారణ ఎదుర్కుంటారనే ప్రచారం నడుస్తోంది. దీంతో అధికారం కోల్పోయిన బాధ ఓవైపు.. ఈడీ కేసుల బాధ మరోవైపు కేసీఆర్ కుటుంబాన్ని వేధిస్తున్నాయని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈడీ వల్ల ఇప్పటికే కవిత జైలుకు వెళ్లిరాగా, తర్వాత కేటీఆర్ వంతేనా? అని పొలిటికల్ సర్కిల్‌లో టాక్ నడుస్తోంది.
పెద్ది విజయ భాస్కర్