calender_icon.png 20 January, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ పిల్ల ధగడ్..

20-01-2025 12:12:21 AM

స్టార్ డైరెక్టర్ సుకుమార్ తనయ సుకృతివేణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీతాత చెట్టు’. ఆనంద చక్రపాణి, రఘురామ్, భాను ప్రకాశ్, నేహాల్ ఆనంద్ కుంకుమ, రాగ్ మయూర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నా రు. పద్మావతి మల్లా ది దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ సంస్థలు సం యుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు తబితా సుకుమార్ సమర్పకురాలు కాగా నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మాతలు.

జనవరి 24న విడుదల కానున్న ఈ చిత్రంలోని ‘ధగడ్ పిల్ల’ అనే సాంగ్‌ను మేకర్స్ ఆదివారం రిలీజ్ చేశారు. కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం పల్లెటూరి నేపథ్యంలో తెలంగాణ యాసలో కొనసా గుతోంది. రీ సంగీత సారథ్యంలో రాహుల్ సిప్లిగంజ్ ఈ గీతాన్ని ఆలపించారు.