calender_icon.png 23 March, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమగ్రాభివృద్ధికి దిక్సూచి ఈ బడ్జెట్

20-03-2025 02:16:21 AM

ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి శ్రీధర్‌బాబు 

హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): సబ్బండ వర్గాలకు సంక్షేమం, అభి వృద్ధి ఫలాలను చేరవేయాలన్నదే తమ ప్రజా ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నా రు. తమ లక్ష్య సాధనకు ఈ బడ్జెట్ మార్గనిర్దేశనం చేస్తుందని ఒక ప్రకటనలో తెలిపారు. సంతులిత అభివృద్ధికి బాటలు వేస్తుందన్నారు.

సంక్షేమం, ఆర్థిక స్థిరత్వం, వ్యవసా యాభివృద్ధి, మౌలిక వసతుల పెంపు, విద్యారంగ పురోగతి, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, పారిశ్రామికాభివృద్ధి వంటి కీలక అంశాలకు పెద్దపీట వేసిన ప్రగతిశీల బడ్జెట్‌గా అభివర్ణించారు. దేశ భవి ష్య త్తు యువత చేతుల్లోనే ఉందని.. అందుకే తమ ప్రభుత్వం యువతపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు.

అందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెం దిన 5 లక్షల మంది యువతకు రాజీవ్ యు వ వికాసం పథకం కింద రూ.6 వేల కోట్లు కేటాయించామన్నారు. ఒక్కో లబ్ధిదారుడికి రూ.4 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుందన్నారు. తద్వారా యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేసి.. జీవితంలో స్థిరపడేందుకు అవకాశం ఏర్పడు తుంద న్నారు.

ఓవైపు సంక్షేమం.. మరోవైపు అభివృద్ధిని పరుగులు తీయించాలన్నది తమ ప్రణాళికని.. అందుకు అనుగుణంగా ఈ బడ్జెట్ సబ్బండవర్గాలకు ప్రయోజనం చేకూర్చుతూనే.. రాష్ట్రాభివృద్ధికి దిక్సూచిలా దారి చూపుతుందన్నారు.

మాటలు చెప్పే ప్రభుత్వం తమది కాదని.. చేతల్లో చేసి చూపించి ప్రతిపక్షాల నోర్లు మూయిస్తామన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితిని సరిదిద్దుతూనే.. ఎన్నికల హామీలను నెరవేర్చేలా ఈ బడ్జెట్ ఉందన్నారు.