calender_icon.png 30 October, 2024 | 6:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ జన్మకిది చాలనిపిస్తుంది

30-06-2024 12:05:00 AM

అల్లు శిరీష్ హీరోగా “ఏబీసీడీ” సినిమా, రాజ్‌తరుణ్‌తో “అహ నా పెళ్లంట” అనే వెబ్ సిరీస్ రూపొందించి తనదైన పయనం సాగిస్తున్నారు దర్శకుడు సంజీవ్ రెడ్డి. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టిందేకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రముఖ నటుడు చిరంజీవితో రూపొందించిన ఓ ప్రచార చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. దీనికి దర్శకత్వం వహించిన సంజీవ్, తన అభిమాన నటుడితో పనిచేయడం గురించి స్పందిస్తూ “ఎవరి సినిమాలు చూస్తూ పెరిగి సినిమా ఇండస్ట్రీకి రావాలి అనుకున్నానో, అలాంటి పద్మవిభూషణ్.. మెగాస్టార్.. చిరంజీవి గారు భాగస్వామి అయిన తెలంగాణ ప్రభుత్వ యాంటీ డ్రగ్ థియేట్రికల్ యాడ్‌లో నేనూ ఒక భాగమైనందుకు, ఇక చాలు ఈ జన్మకి అనిపిస్తుంది. కానీ, ఈ కోరికలకు అంతన్నదే ఉండదు” అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో “సంతాన ప్రాప్తిరస్తు” అనే సినిమా తెరకెక్కుతుండగా, ఈ సినిమాలో విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్నారు.